సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమా తెలుగు, మలయాళంలోనే హిట్ అవుతుందనుకుంటే, మొత్తం దేశాన్నే షేక్‌ చేసింది ఈ సినిమా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా రెండవ భాగమైన “పుష్ప: ది రూల్” పైన అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి.

Video Advertisement

 

 

ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ వర్క్ చేస్తోంది. అయితే ఈ చిత్రం లో కీలక పాత్రల కోసం పలువురు స్టార్ నటులను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే రష్మిక ని హీరోయిన్ గా తప్పించి సాయి పల్లవిని తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చినా అవి నిజం కాదని తెలుస్తోంది. వేరే పాత్ర కోసం సాయి పల్లవిని పుష్ప టీం సంప్రదించిందని సమాచారం. సుకుమార్ ఈ చిత్రం కోసం ఒక బలమైన మరియు గుర్తుండిపోయే గిరిజన అమ్మాయి పాత్రను రాశాడంట. పూర్తి డీగ్లామర్ పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించగలదని మేకర్స్ అభిప్రాయపడుతున్నారట.

rashmika gives clarity on her role in pushpa 2..

అలాగే తాను పుష్ప 2 లో ఉన్నట్లు హీరోయిన్ రష్మిక కూడా క్లారిటీ ఇచ్చి పుకార్లకు చెక్ పెట్టింది. ఈ ఏడాది రానున్న తన సినిమాల గురించి అప్‌డేట్ చేసింది. 4 సర్ ప్రైజ్ లతో అభిమానుల ముందుకు వస్తారని రష్మిక తెలిపింది. తన రానున్న చిత్రాల గురించి ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సంక్రాంతికి విడుదల కానున్న తమిళ చిత్రం వారిసు, పుష్ప 2 , మిషన్ మజ్ను, అలాగే రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ చిత్రం లో కూడా నటిస్తున్నట్లు రష్మిక వెల్లడించింది.

rashmika gives clarity on her role in pushpa 2..

మరోవైపు పుష్ప పార్ట్ 2లో రష్మిక మందన్న, సాయి పల్లవి కూడా నటిస్తారని చిత్రబృందం స్పష్టం చేసింది.  పుష్ప 2లో కూడా ఫాహద్ పాసిల్, అనసూయ, సునీల్ నటిస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప: ది రైజ్ విజయం తర్వాత, రష్మిక పాన్ ఇండియా నటిగా ప్రసిద్ధి చెందింది. రష్మిక నేషనల్ క్రష్‌గా మారింది. శ్రీవల్లి పాత్రలో ప్రజల మనసు దోచుకుంది.