రష్మిక మందన్న.. కన్నడ బ్యూటీ అయిన ఈ హీరోయిన్ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఛలో సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో ఈమె రేంజ్ ఒక్కసారి గా మారిపోయింది. ఆ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని తెలుగులో కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. దీంతో ఆ చిత్రం తర్వాత ఆమెకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. హిందీలో ‘గుడ్ బై, మిషన్ మజ్ను’ చిత్రాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Video Advertisement

 

 

ఇటీవలే దళపతి విజయ్‌తో ‘వారిసు’ చిత్రంలో నటించింది. అలాగే తెలుగులో గతేడాది ‘సీతారామం’ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సక్సెస్‌లో భాగమైంది. అయితే రష్మిక ఈ మధ్య కాలం లో వరుస వివాదాల్లో చిక్కుకుంటూ.. ట్రోల్స్ బారిన పడుతున్నారు. ఈ నెగటివిటీ తనను చాలా ఎఫెక్ట్ చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన రష్మిక.. తాజాగా మరోసారి నెగెటివిటీపై నోట్ షేర్ చేస్తూ ట్రోలర్స్‌కు చురకలేసింది. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

rashmika latest post on negativity..

రష్మిక ఆ పోస్ట్ లో ” సంతోషంగా ఉండండి.. జీవితంపట్ల ఆశావాద దృక్పథంతో ఉండండి.. మీ ఆనందం, శ్రేయస్సు అనేవి మీ జీవితంలో అన్నింటి కంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగినవి. జీవితం చాలా చిన్నది.. దాంట్లో నెగిటివిటీకి తావు లేదు..” అంటూ ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ తో పాటు తన ఫోటోని షేర్ చేసింది రష్మిక. ఈ పోస్ట్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

rashmika latest post on negativity..

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌తో ‘పుష్ప2’ చిత్రంలో నటిస్తోంది. అలాగే రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే రష్మిక లేటెస్ట్‌గా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యడానికి ఓకే చెప్పిందని సమాచారం. అంతేకాదు ఈ స్పెషల్ సాంగ్‌లో నటించడానికి రష్మిక దాదాపుగా ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. అయితే అంత మొత్తం కూడా ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.