పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకొన్న హీరోయిన్ రష్మిక మందన్న ఆ తర్వాత నేషనల్ క్రష్‌గా మారింది. కన్నడ భాషలో కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా మారింది. పుష్ప తర్వాత బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

Video Advertisement

 

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రష్మిక, తాను ఎలా సినీ ఇండస్ట్రీ లోకి ప్రవేశించిందో చెప్పింది. అయితే ఇక్కడ ఆమె కాంతార డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించి కానీ, కిరిక్ పార్టీ హీరో హీరో రక్షిత్ శెట్టి గురించి కానీ మాట్లాడకుండా.. అప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు కాల్ వచ్చింది అని చెప్పడంతో నెటిజన్లు ట్రోల్స్ స్టార్ట్ చేసారు.

rashmika mandanna gets strong reaction from rishab shetty..

వివరాల్లోకి వెళ్తే.. ఆ ఇంటర్వ్యూ లో రష్మిక మాట్లాడుతూ..” అందాల పోటీలో ప్రకటన వస్తే.. నేను అందులో పాల్గొన్నాను. ఆ పోటీల్లో స్టేట్ లెవెల్ పోటీల్లో గెలిచాను. దాంతో నా ఫోటోను ప్రముఖ ఆంగ్ల దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించింది. ఆ తర్వాత ఓ సినిమా ప్రొడక్షన్ కంపెనీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది” అంటూ రెండు చేతులు పైకి ఎత్తి ఫింగర్స్ క్రాస్ చేసి ఓ రకమైన సైగలతో ఆమె చెప్పుకొచ్చింది.

rashmika mandanna gets strong reaction from rishab shetty..

అయితే ఆమె కెరీర్ బిల్డ్ అవ్వడానికి అంత సూపర్ హిట్ ఇచ్చిన రిషబ్ శెట్టి పేరును పలకడానికి రష్మిక మందన్న ఇష్టపడలేదనేది వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయితే తనకు మొదటి ఆఫర్ ఇచ్చిన రిషబ్ శెట్టి గానీ, లేదా రక్షిత్ శెట్టి గురించి గానీ ప్రస్తావించకపోవడంపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు.

rashmika mandanna gets strong reaction from rishab shetty..

అయితే కాంతార మూవీతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన రిషబ్ శెట్టి బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు ఉన్న హీరోయిన్లు రష్మిక మందన్న, సమంత రుత్ ప్రభులో ఎవరు బెస్ట్ అంటే.. నాకు సమంత ఫెర్ఫార్మెన్స్ అంటే ఇష్టం అని స్పష్టంగా చెప్పారు.

rashmika mandanna gets strong reaction from rishab shetty..
అంతే కాకుండా మరో ఇంటర్వ్యూ లో సమంత, రష్మిక, కీర్తీ సురేష్, సాయిపల్లవిలో ఎవరిని ఎంచుకొంటారని అడిగిన ప్రశ్నకు రిషబ్ శెట్టి సమాధానం ఇస్తూ.. సమంత, సాయిపల్లవితో పనిచేయాలని కోరుకొంటాను. అయితే చేతులు పైకి ఎత్తి.. ఫింగర్స్ క్రాస్ చేసే కొందరు హీరోయిన్ల (రష్మిక) అంటే నాకు ఇష్టం ఉండదని గట్టిగా సెటైర్ వేశారు.