రష్మిక మందన్న.. కన్నడ బ్యూటీ అయిన ఈ హీరోయిన్ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఛలో సినిమా తర్వాత ఈమె రేంజ్ ఒక్కసారి గా మారిపోయింది.ఆ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని తెలుగులో కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. దీంతో ఆ చిత్రం తర్వాత ఆమెకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి.

Video Advertisement

 

పుష్ప చిత్రం తర్వాత ఆమె బాలీవుడ్ లో అమితాబ్ తో కలిసి ‘గుడ్ బాయ్’ చిత్రం లో నటించింది. ఆ తర్వాత ఆమె ‘మిషన్ మజ్ను’ చిత్రం లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.శంతను బాగ్చీ దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్ మూవీ ‘మిషన్ మజ్ను’. ఈ చిత్రం లో రష్మిక నస్రీన్ అనే ఒక అంధురాలి పాత్రలో నటించింది. ఈ చిత్రానికి గాను ఆమె మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

rashmika remunaration for mission majnu movie..

రష్మిక సౌత్ సినిమాల్లో ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇటీవల విజయ్ తో నటించిన వారిసు చిత్రానికి గాను ఆమె నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇక ఆమె అల్లు అర్జున్ సరసన పుష్ప 2 , రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రాల్లో నటిస్తున్నారు. వరుస హిట్స్ తో దూసుకు పోతున్న రష్మిక తన రెమ్యూనరేషన్ ని కూడా పెంచేస్తోంది.

rashmika remunaration for mission majnu movie..

బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ ర‌ష్మిక మంద‌న్న జోరు కొన‌సాగుతోంది. స్టార్ హీరోల‌తో జోడిక‌డుతూ దూసుకుపోతున్న‌ది. హీరోయిన్‌గా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సీతారామం సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తర్వాత ఆమె మరో తెలుగు చిత్రం లో కనిపించలేదు. సూపర్ హిట్ చిత్రం పుష్ప 2 సీక్వెల్ లో ప్రస్తుతం రష్మిక నటిస్తోంది.