Ads
దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎన్నో రకాలుగా తమ సత్తా చాటారు, చాటుతూనే ఉన్నారు, ఉంటారు కూడా. మన తెలుగు వాళ్లు సాధించిన ఘనతల్లో ఒకటి పెన్నుల తయారీ. అవును.
Video Advertisement
దేశవ్యాప్తంగా మొట్టమొదట పెన్ తయారైంది మన తెలుగు రాష్ట్రం లోనే. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి చెందిన రత్నం పెన్ వర్క్స్ అనే షాపు భారతదేశంలో మొట్టమొదటగా పెన్నుని తయారుచేసింది.
స్వతంత్రం రాకముందు కోసూరి వెంకటరత్నం గారు రత్నం స్వదేశీ పెన్నులు తయారీ సంస్థను స్థాపించారు. గాంధీ గారు చెప్పిన విదేశీ వద్దు స్వదేశీ ముద్దు అన్న నినాదం చూసి పూర్తి చెందారు వెంకటరత్నం గారు. దాంతో స్వదేశీ ఉద్యమానికి తన వంతు సహకారంగా, అలాగే భారతదేశ పౌరుడిగా తన దేశానికి మద్దతివ్వడం తన బాధ్యత అని భావించిన వెంకటరత్నం గారు ఈ కంపెనీని స్థాపించారు.
1950లో మన దేశ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రమాణ స్వీకారానికి రత్నం గారు రూపొందించిన పెన్ను ని ఉపయోగించారు. అప్పటి నుండి ప్రతి రాష్ట్రపతి తమ ప్రమాణస్వీకారానికి ఈ సంస్థ రూపొందించిన పెన్నులనే ఉపయోగిస్తున్నారు. 1935లో రత్నంగారి కృషికి మెచ్చిన గాంధీ గారు ఆయనను అభినందిస్తూ ఒక ఉత్తరం రాశారు. గాంధీ గారు ఆ ఉత్తరంలో ఈ పెన్నులు విదేశీ సంస్థలను తలదన్నేలా ఉన్నాయి అని ప్రశంసించారు.
1937 లో జవహర్లాల్ నెహ్రూ గారు స్వయంగా రాజమండ్రి వచ్చి రత్నం గారి దగ్గర పెన్ను ని కొన్నారు. తర్వాత తర్వాత రత్నం గారి సంస్థ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందింది. మన రాష్ట్ర ప్రధాను లతోపాటు ఆస్ట్రేలియా ప్రధానులు, అమెరికా అధ్యక్షులు, జర్మనీ అధ్యక్షులు కూడా రత్నంగారు తయారుచేసిన పెన్నులను ఉపయోగించారు.
ఈ సంస్థకు ఇంకో విశేషం కూడా ఉంది. వీరు బంగారు పెన్నులను కూడా తయారు చేస్తారు. వీరు రూపొందించిన పెన్నుల ఖరీదు 150 రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు కూడా ఉంటాయి. రత్నం పెన్ వర్క్స్ సంస్థ 24 అంగుళాల పొడవు ఉన్న పెన్ను ను తయారుచేసి దేశవ్యాప్తంగా రికార్డు సాధించింది. రాజకీయ నాయకులే కాకుండా ఎందరో భారతదేశ స్వాతంత్ర సమరయోధులు కూడా రత్నం గారు రూపొందించిన పెన్నులను ఉపయోగించే వాళ్ళు.
End of Article