“రావణాసుర” సెన్సార్ రివ్యూ..! సినిమా హిట్టా..? ఫట్టా..?

“రావణాసుర” సెన్సార్ రివ్యూ..! సినిమా హిట్టా..? ఫట్టా..?

by Anudeep

Ads

టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహరాజ్ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలు సూపర్ హిట్స్ కావడంతో రవితేజ హ్యాట్రిక్ పై కన్నేశాడు. ఇక ప్రస్తుతం రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలకు, టీజర్, ట్రైలర్స్ కి మంచి స్పందన వచ్చింది.

Video Advertisement

అయితే ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తారని మూవీ టీం ఆశించింది. కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఈ మూవీ కి A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. విపరీతమైన వయోలెన్స్ మరియు బూతులు ఉంటే తప్ప సెన్సార్ బోర్డు ఇలా A సర్టిఫికెట్ ఇవ్వదు.అలాంటిది ఈ చిత్రానికి ఆ సర్టిఫికెట్ ఇచ్చింది అంటే మూవీ లో అంత హింస ఉందా? అని అనుకుంటున్నారు అభిమానులు.

ravanasura movie censor review..!!

అలాగే A సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు మల్టిప్లెక్స్ లలో 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎంట్రీ లేదన్న విషయం తెలిసిందే. కానీ సినిమా పై నమ్మకం తో మేకర్స్ ముందడుగు వేస్తున్నారు. ట్రైలర్ చూసినప్పుడు కూడా ఇది కేవలం రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న సినిమాలాగానే అనిపించింది కానీ సెన్సార్ రిపోర్ట్ మాత్రం వేరేలా ఉంది అని చర్చించుకుంటున్నారు రవన్న ఫాన్స్.

ravanasura movie censor review..!!

ఈ మూవీ లో 30 కట్స్ ఇచ్చి యూ/ఏ ఇస్తామని సెన్సార్ బోర్డు చెప్పగా మేకర్స్ ఒప్పుకోలేదట. దీంతో ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండటం వలన దీనికి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా నడివి 2 గంటల 11 నిమిషాలు ఉంది. ఇక ఈ మూవీ లో దక్ష నగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా చేశారు. సుశాంత్ ఒక కీలక పాత్రలో నటించారు.


End of Article

You may also like