టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహరాజ్ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలు సూపర్ హిట్స్ కావడంతో రవితేజ తదుపరి చిత్రాలపై ఆసక్తి పెరిగింది. ఇక ప్రస్తుతం రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ఇక మాస్ మహరాజ్ రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీజర్ వచ్చేసింది.తాజాగా రావణాసుర సినిమా టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు.

Video Advertisement

 

 

ఈ టీజర్‌ను చూస్తుంటే ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ అని తెలుస్తోంది. రవితేజ వరుసగా హత్యలు చేస్తూ వెళ్తున్నాడు. ఇక జయరామ్ వాటిని కనిపెట్టే ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. ప్రతీ కిల్లర్ మర్డర్ చేసినప్పుడు తన సైన్ వదిలి వెళ్తాడు.. ఆ సైన్ ఏంటో కనిపెట్టాలి అంటూ చెప్పిన డైలాగ్‌ బాగుంది. మొత్తానికి టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశాడు సుధీర్ వర్మ.

ravi teja ravanasura teaser review..!!

నిమిషం 6 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. పోరాట సన్నివేశాలు, విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సుశాంత్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. “సీతను తీసుకుని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి.” అనే డైలాగ్ టీజర్‌లో హైలెట్‌గా నిలిచింది. అయితే టీజర్ లో రవితేజను చాలా వరకూ నెగిటివ్ పాత్రలోనే చూపించారు. అయితే నిజంగా సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుంది తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.

ravi teja ravanasura teaser review..!!

ఇక మరోవైపు ప్రస్తుతం రవితేజ ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇటీవల వచ్చిన ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా వంద కోట్ల గ్రాస్ రాబట్టి అందరినీ మెప్పించింది. వంద కోట్ల క్లబ్బులో మొదటి సారిగా రవితేజ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో రావణాసుర సినిమాపై ఇప్పుడు మంచి బజ్ ఏర్పడింది. రావణాసుర సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే ఏప్రిల్ 7న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. అను ఇమాన్యుయేల్, ఫరియా, మేఘా ఆకాష్ నటిస్తోన్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు.

watch video: