సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా… తన మాస్ పర్ఫార్మెన్స్ తో.. ఎనర్జిటిక్ యాక్టింగ్తో.. తెలుగు టూ స్టేట్స్‌లో ఎప్పుడూ హంగామా చేసే మాస్ మహ రాజ్‌ రవితేజ.. మరో సారి తన పర్ఫార్మెన్స్‌కున్న పవర్ ఏంటో చూపించారు. తన యాక్టింగ్‌కున్న ఎనర్జీ ఏంటో తెలిసేలా చేశారు. వరుసగా రెండు ప్లాప్‌ల వచ్చిన తరువాత కూడా.. ధమాకా సినిమాతో అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకున్నాడు రవితేజ.

Video Advertisement

 

 

రవితేజ హీరోగా వచ్చిన పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ధమాకా. శ్రీ లీల హీరోయిన్. త్రినాథ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇప్పటివరకు రవితేజ కెరియర్ లో వచ్చిన అన్ని మూవీస్ తో పోలిస్తే హై బడ్జెట్ మూవీ గా ధమాకా రూపుదిద్దుకుంది. అయితే ఈ చిత్రం రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో అదరగొట్టింది.

raviteja movies hits and flops..

ఈ చిత్రానికి ముందు రవితేజ ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలు చేయగా అవి ప్లాప్ అయ్యాయి. దీంతో రవి తేజ అభిమానులు ఈ చిత్రం పై ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం వారి అంచనాలను అందుకుంటూ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. అంతకు ముందు క్రాక్ చిత్రం తో హిట్ కొట్టారు రవి తేజ. అంతకు ముందు వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘డిస్కో రాజా’ చిత్రాలు కూడా ప్లాప్ అయ్యాయి. అయినా రవి తేజ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

raviteja movies hits and flops..

రవితేజ ధమాకా మూవీ.. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా థియేట్రికల్ బిజినెస్ రేంజ్ 18.30 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని దుమ్ము లేపగా టోటల్ గా సినిమా బిజినెస్ వాల్యూ 50.30 కోట్ల దాకా సొంతం చేసుకుంది అని చెప్పాలి. అయితే సినిమా బడ్జెట్ మీద 10.30 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను మేకర్స్ కి దక్కేలా చేసిన సినిమాతో వరుస ఫ్లాఫ్స్ లో కూడా రవితేజ మరోసారి తన స్టామినా చూపించాడు.