Ads
కొన్ని కొన్ని సార్లు ఆలయాల్లో వింతలు జరుగుతూ ఉంటాయి. నిజంగా ఇలాంటి వాటిని వింటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి సంఘటన ఒకటి అరుణాచల ఆలయంలో జరిగింది. మరి ఆ సంఘటన గురించి ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
అరుణాచల ఆలయ ప్రాంగణంలో ఒకసారి ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఇలా ఆడుతున్న క్రమంలో వారి దృష్టి అరుణాచల ఆలయ సన్నిధిలో ఉండే హుండీపై పడింది. ఎవరూ లేనప్పుడు ఆ పిల్లలు వెళ్లి హుండీలో వున్న డబ్బులను సన్నని రేకుతో లాగి తీయడం మొదలుపెట్టారు. ఇంతలో ఒక పిల్లవాడు ఎవరైనా వస్తున్నారా ఏమో చూడరా అని మరొకడితో చెప్పాడు.
రెండవ వాడు చుట్టూ చూసి అరుణాచలుడు పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తున్నాడురా అని అన్నాడు. ఇద్దరు దేవుడు ముందు నిలబడి మా దొంగతనం బయట పడకుండా నువ్వే చూడాలి అని అన్నారు. అందుకు పటిక బెల్లం లో మూడవ వంతు ఇస్తాము అన్నారు. ముగ్గురం సమానంగా తీసుకుందాము అని దేవుడికి చెప్పారు.
ఇలా ప్రతిరోజూ పటిక బెల్లాన్ని అరుణాచలానికి పెడుతున్నారు. వాళ్లు రోజు పెట్టే పటికబెల్లం మాయమైపోతుంది. ఓనాడు ఆలయ పూజారి ఇద్దరు దొంగలను పట్టుకుని ఆలయ అధికారికి అప్పగించారు. వీళ్ళ వయసు చూస్తే ఎనిమిదేళ్ళు. ఎలా శిక్షించాలి వీళ్ళని అని… ఇద్దర్నీ 108 ప్రదక్షిణలు చేయమన్నారు. ఇదే శిక్ష అని చెప్పారు.
పిల్లలిద్దరూ కూడా ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టారు. ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చుని ఉండగా వీళ్లు ప్రదక్షిణాలు వినోదంగా చేయడం మొదలుపెట్టారు. ఇంతలో పూజారి, అధికారి ఒక్కసారిగా తుళ్ళి పడ్డారు. ఇద్దరు పిల్లలతో పాటు మూడవ పిల్లవాడు కూడా ప్రదక్షిణం చేయడం చూశారు. మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు.
ఒక్కసారిగా మాయమవుతాడు. ఇది గమనించి ఆలయ అధికారి పిల్లల దగ్గరికి వెళ్లి మూడవ పిల్ల వాడిని గట్టిగా పట్టుకున్నాడు. మూడవ పిల్లవాడు కాంతిరేఖగా మారి గర్భాలయం లోకి వెళ్లి మాయమైపోయాడు. శివుడు దొంగ పటిక బెల్లాన్ని మూడోవంతు తిన్నాడు కదా అందుకని ప్రదక్షిణం చేశాడు. ఆ తర్వాత అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ ఏమయింది అని అసలు విషయం తెలుసుకున్నాడు.
జరిగినది అంతా తెలుసుకుని ఆశ్చర్యం ఆనందంతో మునిగిపోయారు. సాక్షాత్తు ఆ పరమశివుడే మూడవ వాటాన్ని పంచుకున్నాడు. అందుకే శిక్ష అనుభవించాడు అని అనుకున్నారు. అరుణాచలం ఓ కాంతి రూపంలో ఉంటాడని అగ్నిలింగం అని శాస్త్రవచనం. ఆ కొండల పైన ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక కాంతి రూపంలో భక్తుల్ని శివుడు అనుగ్రహించిన సంఘటనలు చాలా ఉన్నాయి.
End of Article