కేజీఎఫ్ చరిత్ర ఏంటో తెలుసా..? ఆ గనుల్లో బంగారాన్ని మనం ఎందుకు తవ్వుకోలేకపోతున్నాం?

కేజీఎఫ్ చరిత్ర ఏంటో తెలుసా..? ఆ గనుల్లో బంగారాన్ని మనం ఎందుకు తవ్వుకోలేకపోతున్నాం?

by Anudeep

Ads

అసలు కెజిఎఫ్ అంటే ఏంటో తెలుసా..? కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. అసలు కెజిఎఫ్ అనగానే మనకి సినిమా పేరు గుర్తొచ్చేస్తుంది. కానీ భారత్ లో ఉన్న ఈ గనుల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ప్రాంతం లో పందొమ్మిదవ శతాబ్దం లోనే బంగారం కోసం తవ్వకాలు జరిగేవి అని ఇప్పటి ప్రజలకు తెలియదు. గతం లో ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) భారత్ కి ఎంతో ముఖ్యమైన బంగారు గని గా పేరు ప్రతిష్టలు సంపాదించింది. కానీ, ఆ పేరు ప్రతిష్టలు ఎంతో కాలం నిలవలేదు. ప్రభుత్వం వాటిని మూసివేయించింది. ప్రస్తుతం ఈ గనుల్లో ఎలాంటి బంగారం తవ్వకాలు జరగడం లేదు. ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

ఎన్టీవీ కధనం ప్రకారం …భారతీయులకంటే ముందే బ్రిటిష్ వారు గుర్తించారు. అప్పటి మహారాజు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి పోరాడారు. ఆ సమయం లోనే ఆంగ్లో-మైసూరు యుద్ధాలు చోటు చేసుకున్నాయి. 1767 – 69 వ సంవత్సరాలలో ఈ యుద్ధాలు జరిగాయి. ఇలా వరుస గా మూడు సార్లు ఆంగ్లో మైసూరు యుద్ధాలు చోటు చేసుకున్నాయి.

1780 – 84 లో రెండో ఆంగ్లో మైసూరు యుద్ధం, 1790 – 92 లో మూడవ మైసూరు యుద్ధం జరిగింది. 1799 లో జరిగిన నాలుగవ మైసూరు యుద్ధం లో టిప్పు సుల్తాన్ మరణించారు. కాలక్రమం లో అక్కడ సామంత రాజులను పెట్టి పరిపాలన కొనసాగించారు. ఆ తరువాత 1802 వ సంవత్సరం లో బ్రిటిష్ వారు మైసూర్ ను పూర్తిగా అధీనం లో తీసుకున్నారు.

ఆ తరువాత .. 1804 వ సంవత్సరం లో ఈస్ట్ ఇండియా కి చెందిన మైకేల్ అనే వ్యక్తి ఓ ఆర్టికల్ లో ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి, అందులో ఉన్న బంగారు గనుల గురించి తెలుసుకున్నాడు. సమయం చూసుకుని, 1871 సంవత్సరం లో బెంగళూరు కు షిఫ్ట్ అయ్యాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆ ప్రాంతం లో తవ్వకాలు జరిపాడు. అభివృద్ధి పేరిట అక్కడ ఉన్న బంగారాన్ని తవ్వుకుపోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం  ఎత్తుగడ వేసింది.

1900వ సంవత్సరంలో మైసూరు మహారాజు కు బ్రిటిష్ ప్రభుత్వం ఓ ప్రతిపాదన పంపింది. కోలార్ ప్రాంతం లో కావేరి నదిపై జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపింది. వెంటనే ఈ ప్రతిపాదనకు మైసూర్ మహారాజు కూడా అంగీకారం తెలిపారు.

kgf gold

ఈ కోలార్ గనుల్లో 56 కేజీల మట్టిలో గ్రాము బంగారం లభించేది. ఈ ప్రాంతం లో గోల్డ్ గురించి బ్రిటిష్ ప్రభుత్వం సర్వ్ చేసింది. 1850 వ సంవత్సరం లో లావెల్లి అనే వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయం లో నే కోలార్ గురించి ఆసక్తికర విషయాలను ఓ ఆర్టికల్ లో చదవడం ద్వారా తెలుసుకున్నారు. రెండేళ్ల పాటు కోలార్ లో పర్యటించారు. అక్కడ అద్భుతమైన బంగారు గని ఉందని తెలుసుకుని.. ఆ బంగారాన్ని వెలికితీయాలని భావించాడు. తన ప్రయత్నాలను కొనసాగించాడు. ఈ గనులు తవ్వడానికి 1875 వ సంవత్సరం లో కోలార్ గనులను లావెల్లి కి 20 ఏళ్ల పాటు లీజుకిచ్చారు.

కానీ, ఈ గనులు తవ్వడానికి చాలా ఖర్చు అయ్యేది.. బంగారం మాత్రం దక్కలేదు. దీనితో ఈ బంగారాన్ని వెలికి తీయడానికి తన వద్ద అంత డబ్బు లేకపోవడం తో తనకు ఉన్న హక్కులను అమ్మేసుకున్నాడు. ఆ తరువాత చాలా మంది గనుల తవ్వకానికి ప్రయత్నించినా.. ఎవరు నిలవలేదు. మధ్యలోనే వెళ్ళిపోయేవారు. 1880 లో టేలర్ అండ్ సన్స్ కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. కెజిఎఫ్ పనులను ముమ్మరం చేసింది. అప్పటి వరకు కెజిఎఫ్ నష్టాల్లోనే ఉంది. ఈ కంపెనీ ఇంగ్లాండ్ నుంచి ఎన్నో మెషీన్లను తెప్పించి సాంకేతికం గా అభివృద్ధి చేసింది. ఈ తవ్వకాలు మొదలవడం తో టేలర్ అండ్ సన్స్ కంపెనీ లాభాల బాట పట్టింది.

kgf1-Kgf2-Meme-Templates

ఇక్కడ పని చేయడానికి ఎంతో మంది ఇంజినీర్లు బ్రిటిష్ నుంచి వచ్చారు. 1900 నుంచి 1910 మధ్య ప్రాంతం లో ఈ గనులకు గోల్డెన్ టైం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలం లో ఒక లక్ష డెబ్భై వేల టన్నుల గోల్డ్ ను వెలికితీశారు. చాలా లోతు వరకు తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ గనిని ప్రపంచం లోనే లోతైన గని గా పేర్కొన్నారు. అయితే, కిరోసిన్ దీపాలతోనే ఈ తవ్వకాలు జరిగేవి. ఇబ్బందులు ఎదురు కావడం తో ఇక్కడా కూడా పవర్ ప్లాంట్ ను సృష్టించాలని భావించారు. అప్పటికే ఇంగ్లాండ్ లో పవర్ ని సృష్టిస్తున్నారు. ఇక్కడ కూడా పవర్ ను సృష్టించాలన్న ఉద్దేశం తో కావేరి నదిపై పనులను మొదలు పెట్టారు.

kgf1-Kgf2-Meme-Templates

ఆ ప్రాంతం లో విద్యుత్ ఏర్పాటు చేసారు. కోలార్ ప్రాంతం లో మొత్తం 148 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయించింది. ఆ రోజుల్లోనే కోలార్ విద్యుత్ లైన్ అత్యంత పొడవైన విద్యుత్ లైను గా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఆ పవర్ ప్లాంట్ దేశంలోనే మొదటి పవర్ ప్లాంట్ గా నిలిచింది. విద్యుత్ పనులు ప్రారంభం కాగానే, ఆ ప్రాంతం లో బంగారాన్ని దోచుకెళ్లే పని ని కూడా మొదలు పెట్టేసారు. ఆ ప్రాంతం లో ఎక్కువ మంది బ్రిటిష్ వారే ఉండేవారు. అక్కడే బంగ్లాను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతమంతా ఒక మినీ ఇంగ్లాండ్ గా మారిపోయింది. వారికింద పని చేసే భారతీయులు మాత్రం షెడ్లు ఏర్పాటు చేసుకుని ఉండేవారు.

real kgf

అక్కడ కూలీల బతుకులు మాత్రం దుర్భరం గా ఉండేవి. ఒక దశలో బంగారాన్ని దోచుకుంటున్నారని కెజిఎఫ్ కోర్టుకెళ్లింది. దీనితో, అదనపు రాయల్టీని ఇవ్వడానికి ఇంగ్లాండ్ ఒప్పుకుంది. అలా, ఒప్పందం తో ఇంగ్లాండ్ భారత్ నుంచి నేరు గా బంగారాన్ని ఎగుమతి చేసుకుంది.  స్వాతంత్య్రం వచ్చాక, 1956 లో ఈ గనులు జాతీయ గనులు గా పేరుపొంది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చాయి. అప్పుడు కూడా ఈ గనుల్లో తవ్వకాలు జరిగేవి. 2001 వ సంవత్సరం వరకు ఈ తవ్వకాలను కొనసాగించారు. భారత్ లో ఉత్పత్తి అయ్యే బంగారం లో 95 శాతం బంగారం ఈ ప్రాంతం నుంచే వచ్చేది.

kgf gold fields

వరల్డ్ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవద్దని అప్పటి ప్రధాని నెహ్రు కెజిఎఫ్ గనులను తాకట్టు పెట్టారు. ఆ తరువాత 1980 లలోనే కెజిఎఫ్ పతనం మొదలైనట్లు చెబుతారు. 2001 నాటికి మూడు కిలోమీటర్ల మేర సొరంగాలు ఏర్పడ్డాయి. మట్టి లో గోల్డ్ లెవెల్ మాత్రం గణనీయం గా పడిపోయింది. 95 పర్సెంట్ నుంచి 0 పర్సెంట్ కి పడిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి తవ్వకాలు జరగడం లేదు. ఇప్పటికైనా వాటిని తిరిగి తెరిచి తవ్వాలని కొందరు భావిస్తున్నారు. కానీ, ఆ ప్రాంతం లో ఉన్న బంగారం నిల్వల విలువ కంటే.. వాటిని బయటకు తీయడానికి అయ్యే ఖర్చే ఎక్కువ. అందుకే ఆ ప్రయత్నాల్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది.

watch video:


End of Article

You may also like