ఇది కథ కాదు…నిజంగానే జరిగింది.! బ్రిటిష్ దొర కోసం నడిచొచ్చిన అమ్మవారు.! అసలేమైంది.?

ఇది కథ కాదు…నిజంగానే జరిగింది.! బ్రిటిష్ దొర కోసం నడిచొచ్చిన అమ్మవారు.! అసలేమైంది.?

by Harika

Ads

ఎన్ని కధలు విన్నా.. అమ్మ వారి లీలలు ఎన్ని కళ్లారా చూసిన తనివి తీరదు. ఆనాడు మూగవాడైన శంకరుని చేత పద్యాలే పలికించింది కామాక్షమ్మ తల్లి. మూర్ఖుడైన కాళిదాసుని మహా కవిని చేసిన కాళికా మాత లీలల గురించి తెలియని వారెవరు ఉండరు. ఆకలితో అన్నం కోసం అలమటిస్తున్న గణపతి మహామునికి స్వయంగా అన్నపూర్ణా దేవీ అన్నం వడ్డించింది అని చెబుతుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. పరమ దయామణి అయిన అమ్మ వారి లీలలకు అంతే ఉండదు. అలాంటి ఓ లీల గురించి ఇప్పుడు మనం చెప్పుకుంది. ఈ సంఘటన ఓ బ్రిటిష్ దొరకు అనుభవమైంది.

Video Advertisement

image credits:Dheivegam.com

ఇది కథ కాదు.. నిజంగా జరిగింది. బ్రిటిష్ వారు రాజ్యమేలుతున్న కాలంలో పీటర్ అనే వ్యక్తి మధురైకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఉండేవారు. ఆయన ఆఫీస్ కి తన గుర్రం మీద వెళ్లేవారు. ఇంటినుంచి ఆఫీస్ కి వెళుతున్న దారిలోనే మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయం ఉండేది. అయితే.. ఆయన దేవాలయం ముందు వెళ్తున్న సమయంలో చెప్పులు తీసేసి.. గుర్రం నుంచి దిగి భక్తిగా నడుచుకుంటూ వెళ్లేవారు.

ఓ రోజు రాత్రి పీటర్ తన ఇంట్లో నిద్రిస్తూ ఉన్నారు. ఆ సమయంలో భయంకరంగా నడుస్తూ ఉన్నారు. ఇంతలో పీటర్ కు మెలకువ వస్తుంది. ఎదురుగా ఓ స్త్రీ మూర్తి నిండుగా ఆభరణాలు ధరించి కనిపిస్తుంది. ఆమె పీటర్ ను బయటకిరా అని పిలుస్తూ నడుస్తూ ఉంటుంది. పీటర్ కు ఏమీ అర్ధం కాక కనీసం చెప్పులైనా లేకుండా అలానే బయటకి నడుస్తూ వెళ్ళిపోతాడు.

ఉన్నట్లుండి.. ఆ స్త్రీ మూర్తి మాయమవుతుంది. పీటర్ కు ఏమి జరిగిందో అర్ధం కాదు. తిరిగి వెనక్కి వెళ్లబోతాడు. అంతలోనే భారీ వర్షం కారణంగా ఆ ఇల్లు కూలిపోతుంది. అప్పుడు తనను కాపాడడం కోసమే ఆ మధుర మీనాక్షి తల్లి వచ్చి పిలిచింది అని పీటర్ అర్ధం చేసుకుంటాడు. మరుసటి రోజు అమ్మవారి గుడికి వెళ్లి అక్కడి పూజారులకు జరిగింది చెబుతాడు. తాను చూసిన అమ్మవారికి చెప్పులు లేవు కానీ పట్టీలు ఉన్నాయని  చెప్పి.. తాను అమ్మవారికి చెప్పులు ఇస్తాను అని అక్కడివారు అనుమతి అడుగుతాడు.

412 రూబీస్, 72 ఎమిరాల్డ్స్, 80 డైమండ్స్ తో అందమైన పాదుకలను అమ్మవారికి బహుకరిస్తారు. పీటర్ పాదుకలుగా పేర్కొనే వీటిని నేటికీ అమ్మవారి ఆలయంలో “చిత్ర ఫెస్టివల్” లో ప్రదర్శిస్తుంటారు. ప్రతి ఊరేగింపులోనూ వీటిని అమ్మవారికి ధరింప చేస్తుంటారు. అన్య మతస్తుడైనా.. ఆయనకు ఉన్న భక్తి ఆ అమ్మవారిని దర్శించే అనుగ్రహాన్ని ప్రసాదించింది.

 


End of Article

You may also like