ఆమె కాళ్ళు కదలవు… కానీ ఎందరో జీవితాల్ని ఆమె కదిలించింది.. 17 ఏళ్లకే అలా జరిగేసరికి.. రియల్ స్టోరీ!

ఆమె కాళ్ళు కదలవు… కానీ ఎందరో జీవితాల్ని ఆమె కదిలించింది.. 17 ఏళ్లకే అలా జరిగేసరికి.. రియల్ స్టోరీ!

by Anudeep

Ads

ఒక్కోసారి కొందరి జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురై వారి జీవితాన్ని మలుపు తిరుగుతుంది. ఆ అనుకోని సంఘటన వలన ఏర్పడే లోటును అధిగమించలేక జీవితాన్ని చాలిస్తూ ఉంటారు కొందరు.

Video Advertisement

మరికొందరు వచ్చిన సమస్యలను ఎదుర్కుంటూ జీవితంలో  మనోధైర్యంతో ముందుకు సాగిపోతూ, అవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకుని సమస్యలను డీ కొడుతూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతారు.

ఇప్పుడు మనం అలాంటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాము. ప్రతిక్షణం అలుపెరుగని ఉత్సాహంతో సమాజానికి సేవలందించింది ఈమె. ఆమె కరివెప్పిల్ రబియా. కేరళలోని మలప్పురం జిల్లాలోని వెల్లిలక్కడు గ్రామంలో నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించింది రబియా. రబియాకు ఉన్నతమైన చదువులు చదవాలని ఉండేది. ఆమె తండ్రి ఒక చిన్న రేషన్ షాపు నిర్వహించేవాడు. మేనమామ సహాయంతో ఇంటర్ వరకు కాలేజీ విద్యను అభ్యసించింది.

రబియా 9వ తరగతి చదువుతుండగా ఆమెకు పోలియో సోకింది. 17 సంవత్సరాల వయసులో నడుము కింద భాగం పూర్తిగా చచ్చిబడిపోయింది.  ఈ ఘటనతో ఆమె చక్రాల కుర్చీకే పరిమితమై పోయింది. ఈ అనారోగ్య కారణం వలన ఆమె డిగ్రీ మొదటి సంవత్సరం మానివేయవలసి వచ్చింది. అందరు సాధారణ వ్యక్తి లాగానే జీవితంలో ఎదురుదెబ్బ అల్లాడిపోయింది రబియా.

కానీ రబియా తన మనో సంకల్పాన్ని ఆయుధంగా చేసుకుని ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ మరియు పీజీ చదువును కొనసాగించింది. ఒక మంచి పని చేయాలనే సంకల్పంతో 1990 జూన్ లో వయోజన విద్య ప్రచారం ప్రారంభించారు రబియా. తన గ్రామంలో ఉన్న ఎంతోమంది నిరక్షరాస్య మహిళలకు చదువు నేర్పించారు. ఇందుకోసం ఆమె ఇంటిని పాఠశాల గా తీర్చిదిద్దారు. ఈ పాఠశాల అక్రమంగా గురుకులంగా రూపొందింది.

రబియా కేవలం మహిళలకు విద్య నేర్పించడం కాకుండా ప్రభుత్వం నుండి అందే ఉపాధి అవకాశాల గురించి కూడా తెలియజేస్తూ వాళ్లకు ఉపాధిని కలిగించడం మొదలుపెట్టింది. దీనితో రబియా ఆ గ్రామంలో మంచి గుర్తింపు సంపాదించారు.

జూన్ 1992 లో రబియా నడుపుతున్న పాఠశాల గురించి ఉన్నతాధికారులు తెలుసుకుని సందర్శించారు. పాఠశాలలో అధికారులు 80 సంవత్సరాల మహిళ పక్కన 8 సంవత్సరాల పాప విద్యను అభ్యసించడం గమనించారు. దీనితో రబియా టీచర్ కృషిని మర్చిపోకుండా ఉండలేకపోయారు అధికారులు.

తాను నడవలేని పరిస్థితుల్లో ఉన్నా చలనం అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, తనలాగే నడవలేని వారికి మరియు మానసికంగా ఇబ్బంది పడుతున్న చిన్నారుల కోసం ఆరు పాఠశాలల్లో ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా ప్రజలకు ఆరోగ్య అవగాహన, విద్య ప్రాముఖ్యత, మహిళలు ఉపాధి శిక్షణ, నిరంతర విద్యా కొనసాగింపు, దివ్యాంగుల పునరావాసం వంటి కార్యక్రమాలను నిర్వహించారు.

ఇంత మనోధైర్యంతో ముందుకుపోతున్న రబియా జీవితంలో మరొక అనారోగ్య సమస్య తలెత్తింది. 32 సంవత్సరాల వయసులో క్యాన్సర్ బారిన పడ్డారు రబియా. మెడికల్ టెక్నాలజీ సహాయంతో కీమోథెరపీ వైద్యం చేయించుకుని కేన్సర్ బారి నుంచి బయటపడ్డారు.

40 సంవత్సరాల వయసులో బాత్రూంలో కింద పడిపోవడంతో ఆమె శరీరం పూర్తిగా కథ లేని స్థితికి వచ్చేసింది. అక్కడి నుంచి ఆవడం మంచానికే పరిమితమై పోయారు. ఎంత కఠిన పరిస్థితుల్లో ఆవిడ మంచానికే పరిమితమై మాట్లాడలేని స్థితికి వచ్చేశారు.

 

అయినా తన మనో ధైర్యాన్ని కూడగట్టుకుని మౌన రోంబనంగల్ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని 2006 వ సంవత్సరంలో అప్పటి కేరళ ముఖ్యమంత్రి V.S అచ్యుతానందన్ ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది.

రబియా గారు 2009లో తన ఆత్మకథ స్వప్నన్గాల్కు (కలలకు రెక్కలు ఉంటాయి) అనే పుస్తకాన్ని రాసి విడుదల చేశారు. ఈ పుస్తకం ప్రపంచంలో అత్యున్నత ఆత్మకథగా సుకుమార్ అజ్హికోడే అభివర్ణించడం జరిగింది. ఇవే కాకుండా ఇంకొక మూడు పుస్తకాలను రాయడం జరిగింది. ఈ పుస్తకాలు అమ్మడం ద్వారా వచ్చే రాయల్టీ ఆమె వైద్య ఖర్చులకు సరిపోతుంది.

ఈమె నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ 100 మంది వాలంటీర్లతో తన చలనం సమస్థ నడిపిస్తోంది. రబియా సేవలకు గుర్తుగా అనేక అవార్డులను దక్కించుకున్నారు . ఈ సంవత్సరం జనవరి 26న 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రబియా అందించిన ఉత్తమ సేవలకు గుర్తుగా పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించారు.

రబియా జీవితం ఆధారంగా డైరెక్టర్ అలీ అక్బర్ రబియా మూవ్స్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ ఆత్మ కథ చిత్రం మంచి ఆదరణ పొందడంతో 14 భాషల్లో తర్జుమా చేయబడింది.


End of Article

You may also like