ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కారణంగా చాలా సినిమాలు ఓటీటీ లో విడుదలవుతున్నాయి. అందులో ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ లో ఎక్కువగా సినిమాలు విడుదల అవుతున్నాయి. థియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలాగో చూడలేకపోతున్నాం. కనీసం అమెజాన్ ప్రైమ్ లో అయినా రిలీజ్ అయిన వెంటనే సినిమా చూద్దామని కూర్చుంటాం. అలా రిలీజ్ అయింది అని అప్డేట్ రాంగానే, ఇలా అమెజాన్ ప్రైమ్ సెర్చ్ బార్ లో సినిమా పేరు టైప్ చేస్తాం. కానీ వచ్చే రిజల్ట్స్ మాత్రం వేరే సినిమా పేర్లని చూపిస్తాయి.

సరే స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉందేమో అని చెక్ చేసి మళ్లీ టైప్ చేస్తాం. రిజల్ట్ మళ్లీ అలాగే వస్తుంది. ఇంక విసుగొచ్చి వదిలేస్తాం. లేదా వేరే ప్లాట్ ఫామ్స్ లో సినిమా వచ్చేంతవరకు ఆగి, తర్వాత డౌన్లోడ్ చేసుకుని చూస్తాం. అవేంటో అందరికీ తెలుసు. అయితే, అమెజాన్ ప్రైమ్ విషయానికొస్తే అసలు మనం అడిగే సినిమా పేరు ఒకటి అయితే అక్కడ వచ్చే సినిమా పేరు వేరేది ఉంటుంది. అలా అవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదాహరణకి నిశ్శబ్దం సినిమా తీసుకుందాం. ఈ సినిమా పేరుని ఇంగ్లీష్ లో nisabdam, nishabdam, nishabdham ఇన్ని రకాలుగా రాయొచ్చు. ఈ మూడు స్పెల్లింగ్స్ తో మనం సెర్చ్ చేస్తాం. కానీ అమెజాన్ ప్రైమ్ లో మాత్రం nishabdham అని టైప్ చేయండి. కరెక్ట్ సినిమా రిజల్ట్ వస్తుంది. మనం సాధారణంగా ఏ సెర్చ్ ఇంజన్ లో అయినా మొత్తం పేరు టైప్ చేయ్యం. మనం మొదటి కొన్ని అక్షరాలు టైప్ చేయగానే రిలేటెడ్ రిజల్ట్ వస్తుంది.

అమెజాన్ ప్రైమ్ మనం టైప్ చేసే ప్రతి ప్రశ్నని సేవ్ చేసుకుంటుంది (ఆటో ఫిల్). ఆ సేవ్ చేసుకున్న డేటా ఆధారంగా మనం మొదటి కొన్ని అక్షరాలు కొట్టంగానే కొన్ని సజెషన్స్ చూపిస్తుంది. ఒకవేళ మనం ఆ సజెషన్స్ క్లిక్ చేయగానే వేరే ఏవో సినిమాలను చూపిస్తుంది. మనకి కావాల్సిన సినిమా చాలా వెతికిన తర్వాత ఎక్కడో నెక్స్ట్ పేజెస్ లో దొరుకుతుంది. అంటే మనం స్పెల్లింగ్ కరెక్ట్ గా గూగుల్ లో చూసి సినిమా వాళ్లు ఇచ్చినది ఇచ్చినట్టు టైప్ చేస్తే కరెక్ట్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

 

ఇప్పుడు నిశ్శబ్దం సినిమాకి మనం సెర్చ్ చేసే స్పెల్లింగ్ nishabdam. కానీ మనం గూగుల్ లో nishabdam లో అని టైప్ చేసినా కూడా మనకి Nishabdham వస్తుంది. అంటే దాని అర్థం సినిమా పేరు Nishabdham. కాబట్టి ఒకవేళ మనం సెర్చ్ చేయాలి అన్నా కూడా, అది కూడా ఇలాంటి ఓటీటీ లాంటి వాటిలో వెతకాలి అంటే గూగుల్ డైరెక్ట్ చేసిన స్పెల్లింగ్, అంటే Nishabdham టైప్ చేయాలి.

ఇంకొకటి, మనం ఏదైనా ఒక వీడియో పేరు టైప్ చేస్తే, ఒకవేళ అది ఆ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో లేకపోతే దానికి రిలేటెడ్ రిజల్ట్ చూపిస్తుంది. ఇది ఒక అమెజాన్ ప్రైమ్ లో మాత్రమే కాదు వేరే వాటిల్లో కూడా అవుతుంటాయి. ఇలాగే అమెజాన్ ప్రైమ్ లో కూడా అందులో లేని సినిమా పేరు, అంటే అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ తీసుకొని సినిమా పేర్లు టైప్ చేస్తే ఆ సినిమా లేదు కాబట్టి వేరే సజెషన్స్ చూపిస్తుంది.