Ads
ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు గమనించినట్లయితే చిన్న చిన్న నల్లటి ట్యూబులు రోడ్డు మీద అడ్డంగా కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మనకి ఇలాంటి నల్లటి ట్యూబ్స్ కనపడతాయి. ఇవేం కాదులే అని మీరు అనుకుంటే పొరపాటే. దాని వెనుక చాలా పెద్ద అర్ధం వుంది. అదేమిటి రోడ్డు మీద వుండే నల్లటి ట్యూబ్ల వెనుక అంత అర్ధం ఉందా అని ఆలోచిస్తున్నారా..?, లేదా మీరు ఎప్పుడైనా ఆ ట్యూబ్స్ ని చూసి ఏమిటా అని అనుకున్నారా..? అదేనండి మనం ఈరోజు చూడబోయే టాపిక్. మరి ఇక ఆలస్యం లేకుండా దాని కోసం ఓ లుక్ వేసేద్దాం.
Video Advertisement
ఎప్పుడైనా గమనించినట్టైతే రోడ్డు మీద మనకి రోడ్డు మీద చిన్న చిన్న ట్యూబులు ఉంటాయి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మనకి కనపడతాయి. అయితే రోడ్డు మీద వాహనాలు వెళ్ళినప్పుడు ఆ ట్యూబ్ మీద నుండి వాహనం ఎక్కి వెళుతుంది. ఒకసారి ఏదైనా వాహనం ఈ ట్యూబ్ మీదకి ఎక్కి వెళ్లిందంటే.. అప్పుడు ఆ ట్యూబ్ లో వుండే గాలి కిందకి అణుగుతుంది. ఆ ట్యూబ్ కి కనెక్ట్ అయ్యి ఒక కౌంటర్ డివైస్ ఉంటుంది.
ఆ ట్యూబ్ పై వాహనాలు వెళ్ళినప్పుడు ట్యూబ్ లో ఉండే ఎయిర్ ప్రెస్ అయ్యి.. వాహనం వెళ్లినట్లు ఈ డివైస్ గుర్తిస్తుంది. అలా ఒక రోజులో ఎన్ని వాహనాలు వెళ్ళాయో ఈ కౌంటర్ డివైస్ రికార్డు చేస్తుంది. ఇలా రోడ్డు మీద వాహనాలు వెళుతూ ఉంటే రోడ్ కాంట్రాక్టర్ కి ఎన్ని వాహనాలు వెళుతున్నాయి అనేది తెలుస్తుంది. రెండుసార్లు ఏదైనా వాహనం వెళ్లిందంటే ఒక వాహనం కింద లెక్క. దీంతో రోజుకు ఎన్ని వాహనాలు అసలు వెళ్లాయి అనేది లేదా వారానికి ఎన్ని వాహనాలు వెళ్లాయని లెక్కిస్తారు.
అందుకే వీటిని రోడ్డు పైన పెడతారు. అయితే మనకి రోడ్డు మీద కనబడేవి ఏమిటా అని తెలియక మనం పట్టించుకోము. కన్స్ట్రక్షన్ జరగాల్సిన టైం లో.. ఆ రోడ్డు పై ఎన్ని వాహనాలు వస్తాయో గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇలా కన్స్ట్రక్షన్ జరిగే రోడ్డు మీద వుండే నల్లటి ట్యూబ్స్ వెనుక అర్థం ఇదన్న మాట.
End of Article