Ads
భారత దేశం అంటే మొదట గురొచ్చేది మన సంప్రాయాలు. మన దేశంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. మనందరం కూడా అన్ని కాకపోయినా కూడా కొన్ని అయినా పాటిస్తాం. అలా మనం తప్పకుండా పాటించే పద్ధతుల్లో ఒకటి కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు పాలు పొంగించడం.
Video Advertisement
కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు మనందరం తప్పనిసరిగా పాలు పొంగిస్తాం. ఇది ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న పద్ధతి. కానీ అలా చేయడానికి వెనుక ఉన్న కారణం తెలుసా? లక్ష్మీ దేవి సముద్ర గర్భం నుంచి జన్మించారు. లక్ష్మీ పతి శ్రీ హరి కూడా పాల కడలిపై పవళిస్తారు. పాలు పొంగడం వలన అష్టైశ్వర్యాలు, ప్రశాంతత వస్తాయి అని అంటారు.
ఇది మాత్రమే కాకుండా కొత్త ఇంటికి వెళ్లేటప్పుడు పాటించే ఇంకొక ఆచారం ముందుగా గోవుని లోపలికి పంపించి తర్వాత యజమానులు లోపలికి వెళ్లడం. ఇలా చేయడం వెనుక కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే. గోవుని కామధేనువుకి ప్రతిరూపం అని అంటారు. గోవు ఇంట్లోకి వెళ్లడం ద్వారా ఒకవేళ ఇంట్లో దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి.
అంతే కాకుండా ఆ ఇంటి ఆడపడుచుల చేత పాలు పొంగించి ఆ పాలతో వండిన అన్నాన్ని వాస్తు పురుషుడికి సమర్పిస్తే మంచి జరుగతుందని, ఆ ఇంట్లో సంతోషాలకు కొదవ ఉండదు అని అంటారు. గృహ ప్రవేశ కార్యక్రమానికి బంధు మిత్రులందరినీ పిలుస్తారు.
అలా అందరూ ఒక చోట ఉండడం వలన వారు ఆనందంగా ఉండడం మాత్రమే కాకుండా వారందరూ ఎన్నో రోజుల తర్వాత కలుసుకోవడానికి ఇలాంటి సందర్భాలు దోహద పడతాయి. అలా గృహ ప్రవేశ సమయంలో పాటించే పద్ధతులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
NOTE: images used are for representative purpose only.
End of Article