బ్రాహ్మణుల్లో చాలామంది ఉల్లిపాయ, వెల్లుల్లిని ఎందుకు తినరు..? దీని వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటో తెలుసా..?

బ్రాహ్మణుల్లో చాలామంది ఉల్లిపాయ, వెల్లుల్లిని ఎందుకు తినరు..? దీని వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటో తెలుసా..?

by Mohana Priya

మనం చూస్తూనే ఉంటాం. బ్రాహ్మణులు మాంసాహారం తీసుకోరు. అంతే కాదు.. వీరిలో చాలా మంది ఉల్లిపాయను, వెల్లుల్లిపాయను ఆహారంలో భాగంగా తీసుకోరు. నిజానికి వీటివలన శరీరానికి చాలా మేలు జరుగుతుంది. అయినప్పటికీ చాలామంది బ్రాహ్మణులు వీటిని ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడరు.

Video Advertisement

బ్రాహ్మణులలో చాలా మంది ఉల్లిపాయ, వెల్లుల్లిని తినడానికి ఇష్టపడరు. వారి వంటకాలలో కూడా ఇవి లేకుండా వండుకుని తింటూ ఉంటారు. ఈ రెండు పదార్ధాలలోను వాసన ఎక్కువ గా వస్తూ ఉంటుంది.

brahmins 1

ఉల్లిపాయ, వెల్లుల్లి లో సల్ఫర్ (గంధకం) ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే వీటినుంచి ఎక్కువగా వాసన వస్తుంటుంది. వీటిని తీసుకోవడం వలన నాలుకపై వాటితాలూకు వాసన ఎక్కువ సేపు ఉంటుంది. తద్వారా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటి పదార్ధాలను సాత్విక ఆహరం కింద పరిగణించరు. బ్రాహ్మణ కుటుంబాల్లో ఆహార నియమాలు నిష్ఠగా పాటిస్తారు.

brahmins 3

సాత్విక ఆహారం తప్ప ఇతర ఆహారపదార్ధాలను ముట్టుకోరు. ఏ పూటకి ఆ పూటే వండుకుని తింటూ ఉంటారు. తాజాగా ఉన్న కూరగాయలనే వాడుతుంటారు. బ్రాహ్మణుల్లో చాలా మంది మంత్రోచ్ఛారణ, వేద పారాయణాలనే వృత్తిగా ఎంచుకుంటారు. దీనికి స్పష్టమైన ఉచ్చారణ అవసరం. అందుకే వీరు తమో, రజో గుణాలను కలిగించే ఆహారపదార్ధాలు దూరంగా ఉంటారు.

brahmins 2

ఒకప్పుడు పుదీనా (ఎక్కువ వాసన వస్తుంది అని) కు కూడా దూరంగా ఉండేవారు. అయితే..కాలక్రమేణా ఈ అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. ఓ కోరా యూజర్ ఈ విషయం గురించి చెబుతూ తన తాతల కాలం నాటి సంఘటనను పంచుకున్నారు. ఓ ఇంట్లో తాతగారు, మామ్మగారు బయట మంచాలు వేసుకుని పడుకున్నారు. ఆ సమయం లో ఓ దొంగ మామ్మగారి ఒంటిపేట గొలుసుని కొట్టేయాలని వచ్చాడు.

brahmins 4

కాని అతని నోటి నుంచి వస్తున్న ఉల్లిపాయ వాసన వలన ఆమెకు మెలకువ వచ్చి.. “ఉల్లిపాయ కంపు కొడుతున్నావురా… ఈ గొలుసు తీసుకుని ఇక్కడినించి వెళ్ళిపో..” అంటూ విసురుగా పంపేసారట. ఆ తరువాత దొంగ పారిపోతుండగా.. ఆ మామ్మగారు అరిచినా అరుపులకు అందరు లేచి వాడిని పెట్టుకున్నారట. ఇంతటి వాసన వస్తుంటాయి కనుకే.. ఉల్లిపాయ, వెల్లుల్లిని బ్రాహ్మణులు నిషేధిస్తారు.


You may also like