టూత్ పేస్ట్ ట్యూబ్ మీద రంగురంగుల బాక్సులు ఎందుకు ఉంటాయంటే..?

టూత్ పేస్ట్ ట్యూబ్ మీద రంగురంగుల బాక్సులు ఎందుకు ఉంటాయంటే..?

by Megha Varna

Ads

ఎప్పుడైనా మనం ఉపయోగించే టూత్ పేస్ట్లను చూసినట్లయితే టూత్ పేస్ట్ కింద రంగు రంగుల స్క్వేర్ బాక్స్లు లాంటివి కనబడుతూ ఉంటాయి. అయితే ఎందుకు ఆ రంగు రంగుల బాక్సులు ఉంటాయి అనే సందేహం మీకు కలిగిందా…? అయితే మరి ఆ రంగు రంగుల బాక్సులు వెనక ఉండే అర్ధం గురించి ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దాని వెనుక వుండే అర్ధాన్ని చూసేద్దాం.

Video Advertisement

టూత్ పేస్ట్ కింద భాగంలో మనం చూసినట్లయితే ఆకుపచ్చ, నీలం, నలుపు, ఎరుపు రంగులతో బాక్సులు కనబడుతూ ఉంటాయి. అయితే వీటి అర్థం ఏమిటి అని ఇంటర్నెట్ లో మనం చూసినట్లయితే.. ఆకుపచ్చ రంగు బాక్స్ కనుక పేస్ట్ వెనక ఉంటే అది న్యాచురల్ అని.. నీలం ఉంటే న్యాచురల్ మరియు మెడికేటెడ్ అని, ఎరుపు రంగు ఉంటే న్యాచురల్ మరియు కెమికల్ కాంపోజిషన్ కలిగి ఉందని తెలుస్తోంది.

అదే నలుపు రంగుంటే మొత్తం కెమికల్స్ తో నిండి ఉందని చెబుతూ ఉంటారు. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. నిజానికి ఆ బాక్సులకి ఎలాంటి అర్థం లేదు. ఈ టూత్ పేస్టులని ప్యాకింగ్ చేసేటప్పుడు అవి లైట్ సెన్సార్ ఉన్న మిషన్స్ నుండి రోల్ అవుతూ వెళ్లాలి.

ఆ లైట్ సెన్సార్ ఈ పేస్ట్ కింద భాగం లో వుండే కలర్ బాక్సుల్ని డిటెక్ట్ చేసి కట్ చేసి ఫోల్డ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా టూత్ పేస్ట్లను సీల్ చేస్తాయి. వివిధ రంగులని వివిధ రకాల ప్యాకేజీల కోసం వివిధ రకాల సంస్థలు డిటెక్ట్ చేయడం కోసం వాడుతుంటారు.


End of Article

You may also like