Ads
చాలా మంది ఆటగాళ్లు క్రికెట్ ఆడే సమయంలో చూయింగ్ గమ్ ను నములుతూ ఉంటారు. అసలు ఎందుకు చూయింగ్ గమ్ నములుతూ ఆడుతూ ఉంటారు అనే సందేహం చాలా మందిలో కలిగి ఉంటుంది.
Video Advertisement
నిజానికి చూయింగ్ గమ్ ను నములుతూ ఉండటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను ఆటగాళ్లు పొందుతారు. మరి చూయింగ్ గమ్ ను నములుతూ ఉండటం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.
#1. ప్రశాంతంగా రిలాక్స్ గా ఉండొచ్చు:
చూయింగ్ గమ్ ని నములుతూ ఆడడం వల్ల ప్రశాంతంగా ఉండడానికి అవుతుంది ఒత్తిడి మొత్తం దూరం అవుతుంది. రిలాక్స్ గా ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడుతుంది.
#2. హైడ్రేట్ గా ఉండొచ్చు:
చూయింగ్ గమ్ ను నములుతూ ఆడడం వల్ల హైడ్రేట్ గా ఉండడానికి కూడా అవుతుంది. ముఖ్యంగా వేడి ప్రాంతాలు చోట హైడ్రేట్ గా ఉండటం చాలా అవసరం. చూయింగ్ గమ్ నములుతూ ఆడడం వల్ల నీటి శాతం పెరగదు కానీ ఎక్కువ సలైవ ప్రొడ్యూస్ అవుతుంది.
#3. ఎనర్జీ బూస్ట్ కింద పని చేస్తుంది:
ఎనర్జీ బూస్ట్ కింద కూడా చూయింగ్ గమ్ పని చేస్తుంది చూయింగ్ గమ్ తినేటప్పుడు దానిలో ఉంటే షుగర్ విడుదలయ్యి గ్లూకోస్ కింద మారుతుంది .
#4. ఫోకస్ గా ఉండొచ్చు:
చూయింగ్ గమ్ ను నములుతూ ఉండటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. యాక్టివ్ గా ఆటగాడిని ఉంచుతుంది.
#5. రిఫ్లెక్స్ స్పీడ్ ని పెంచుతుంది:
చూయింగ్ గమ్ ను నములుతూ ఆడడం వల్ల బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది. శరీర భాగాల కి త్వరగా మెసేజ్ ని పంపుతుంది. ఇలా ఈ లాభాలను క్రికెట్ ఆడే సమయం లో ఆటగాళ్లు చూయింగ్ గమ్ ని నమలడం వలన పొందొచ్చు.
End of Article