ఇంగ్లీష్ సినిమాల్లో “రొమాంటిక్ సీన్స్” పెట్టేది ఇందుకా..? ఈ కారణం అస్సలు ఊహించనేలేదే.?

ఇంగ్లీష్ సినిమాల్లో “రొమాంటిక్ సీన్స్” పెట్టేది ఇందుకా..? ఈ కారణం అస్సలు ఊహించనేలేదే.?

by Mohana Priya

Ads

సాధారణంగా ఇంగ్లీష్ సినిమాలు అనగానే ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ సినిమాలు కేవలం హాలీవుడ్‌లో మాత్రమే కాకుండా, ఇతర దేశాల్లో కూడా బాగా పాపులర్ అవుతాయి. ఇంగ్లీష్ సినిమాల్లో పాటలు తక్కువగా ఉంటాయి. ఫైట్స్, గ్రాఫిక్స్ లాంటివి కూడా చాలా హై క్వాలిటీలో ఉంటాయి. అందుకనే మన దేశంలో ఏదైనా మంచి సినిమా విడుదల అయినప్పుడు, “హాలీవుడ్ రేంజ్ సినిమా” అని అంటారు. కానీ ఇంగ్లీష్ సినిమాలు అంటే మాత్రం చాలా మందికి గుర్తొచ్చేది అందులో ఉండే రొమాంటిక్ సీన్స్.

Video Advertisement

Reason behind English movies having many romantic scenes

మనదేశంలో విడుదలయ్యే సినిమాలతో పోల్చి చూస్తే ఇంగ్లీష్ సినిమాల్లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కేవలం హాలీవుడ్‌లో మాత్రమే కాదు. ఇతర దేశాలకు చెందిన కొన్ని సినిమాల్లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కానీ సాధారణంగా అలాంటి రొమాంటిక్ సీన్స్ అంటే మాత్రం మనకు ఇంగ్లీష్ సినిమాలే గుర్తొస్తాయి. భారతదేశంలో అలా శృతిమించిన రొమాంటిక్ సీన్స్ ఉంటే సెన్సార్ బోర్డ్ వాటిని కట్ చేస్తుంది. కానీ హాలీవుడ్‌లో మాత్రం అలాంటి పరిమితులు ఏమీ ఉండవు. సినిమాకి తగ్గట్టు సర్టిఫికేషన్ ఇస్తారు. మనం వాళ్ళు పబ్లిసిటీ కోసమో, లేదా క్రేజ్ పెంచుకోవడం కోసం ఇలాంటి సీన్స్ పెడతారు అని అనుకుంటాం. కానీ అలా ఇంగ్లీష్ సినిమాల్లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే.

Things that a mother should tell her son before getting married

అమెరికా, జర్మనీ, జపాన్ తదితర దేశాల మనుషుల్లో ఆక్సిటోసిన్ చాలా తక్కువగా విడుదల అవుతుంది. దీనిని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల వాళ్లు రొమాంటిక్ సీన్స్ చూసినా కూడా వారికి ఎటువంటి ఫీలింగ్స్ కలగవు. అక్కడ ఉండే జనాలకి ఫీలింగ్స్ రావడం కోసం ఎంత వీలుంటే అంత అడల్ట్ కంటెంట్ తీయడానికి అక్కడి ప్రభుత్వం సినిమా వారికి అనుమతి ఇచ్చింది. అలా ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి ఇంకొక కారణం, ఆ దేశంలో జరిగిన సర్వే ప్రకారం ప్రజల్లో ఫీలింగ్స్ తక్కువగా ఉండటంతో వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Reason behind English movies having many romantic scenes

దీంతో ఒకరిమీద ఒకరికి ప్రేమ లేక, పెళ్లి బంధాలు తొందరగా విడిపోతున్నాయి. ఈ కారణంగా, అక్కడ పెళ్లయిన తర్వాత కూడా ఇంకొకరిని ఇష్టపడడం వంటి సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. అందుకే సినిమాల్లో అలాంటి అడల్ట్ కంటెంట్ పెట్టి చాలా మంది వైవాహిక జీవితాన్ని నిలబెట్టాలని ప్రయత్నంతో కూడా ఇలాంటి సీన్స్ చిత్రీకరించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మన భారతదేశంలో అయితే ఆక్సిటోసిన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మన దేశ ప్రజల్లో ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే, ప్రేమ కోసం జనాలు పరితపిస్తుంటారు. ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడరు.

Reason behind English movies having many romantic scenes

ఇలాంటి ఎట్రాక్షన్స్ ని క్యాష్ చేసుకుని ఫారినర్స్ అడల్ట్ కంటెంట్ తీసి వెబ్‌సైట్స్ లో అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. దీని ద్వారా వాళ్ళకి కొన్ని కోట్లలో బిజినెస్ అవుతుంది. మన భారతదేశంలో కేవలం ఇద్దరు మనుషుల మధ్య ఆకర్షణ మాత్రమే కాదు. వస్తువులపై కూడా ఆకర్షణ ఎక్కువగానే ఉంటుంది. గేమ్స్, మందు, సిగరెట్ ఇలా భారతదేశంలో ఉండే వాళ్ళు చాలా వాటికి ఆకర్షితులవుతారు. తర్వాత ఇవే వ్యసనంగా కూడా మారుతాయి. కానీ ఇతర దేశాల్లో మాత్రం ఇద్దరు వ్యక్తులకు మధ్య ఇంతగా ఎట్రాక్షన్ ఉండదు. అలా ఇంగ్లీష్ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ ఉండడానికి వెనకాల ఇంత బలమైన కారణాలు ఉన్నాయి అన్నమాట.


End of Article

You may also like