భారత దేశం అంటే మొదట గురొచ్చేది మన సంప్రాయాలు. మన దేశంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. మనందరం కూడా అన్ని కాకపోయినా కూడా కొన్ని అయినా పాటిస్తాం. అలా మనం తప్పకుండా పాటించే పద్ధతుల్లో ఒకటి కాకులకు అన్నం పెట్టడం. ఈ ఆచారాన్ని ఎన్నో వందల సంవత్సరాల నుండి మనం పాటిస్తున్నాం. కానీ అలా పెట్టడం వెనుక కారణం మనలో కొంత మందికి మాత్రమే తెలుసు.

reason behind feeding the crows

పెద్ద వారికి పితృకార్యాలు చేసేటప్పుడు కాకులని పిలిచి పిండాలు అర్పించడం అనే విషయం గురించి మన అందరికీ తెలిసే ఉంటుంది. అలా వారికి పెట్టిన ఆహారాన్ని కాకులు తింటే పెద్దవాళ్ళ ఆత్మకు శాంతి జరుగుతుంది అని నమ్ముతారు. జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలకు వాహనాలు ఉన్నాయి. అలా శని భగవానునికి కాకి వాహనం అని అంటారు.

reason behind feeding the crows

ఎప్పుడైనా నోములు కానీ వ్రతాలు ఆచరిస్తే నైవేద్యానికి తయారుచేసిన ఆహారంలో కొంత ఆహారాన్ని దానం చేయడం ద్వారా లేదా కాకులకి పెట్టడం ద్వారా ఆ వ్రతం పరిపూర్ణం  అయ్యిందని భావించాలట. కాకి శని భగవానుని అనుగ్రహం పొందినది. అందుకే ఒకవేళ కాకికి అన్నం పెడితే అది శని భగవానునికి దానం చేసినట్లు అవుతుంది అని అంటారు.

reason behind feeding the crows

అందుకే ఇతర పక్షులకంటే కూడా పిలిచిన వెంటనే వచ్చే కాకికి అన్నం పెట్టడం మనం ఎన్నో సంవత్సరాల నుండి పాటిస్తున్న ఆచారం. అంతే కాకుండా పితృదేవతలు కాకుల రూపంలో ఉంటారు. అందుకే వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తిధుల్లో కానీ అమావాస్య రోజుల్లో కానీ వారికి అన్నం పెట్టడం ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది అని అంటారు.