ట్యాబ్లెట్ల మధ్యలో ఆ గీత ఎందుకు ఉంటుందో తెలుసా.? హాఫ్ చేసుకోడానికేనా.?

ట్యాబ్లెట్ల మధ్యలో ఆ గీత ఎందుకు ఉంటుందో తెలుసా.? హాఫ్ చేసుకోడానికేనా.?

by Megha Varna

Ads

ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఆందోళన చెందక్కర్లేదు. ప్రతి సమస్యకి కూడా ట్యాబ్లెట్ వుంటుంది. డాక్టర్లు చెప్పిన విధంగా ఆ మాత్రలని వాడితే అనారోగ్య సమస్యల నుండి త్వరగా బయట పడవచ్చు. చాలా రకాల కంపెనీలు ట్యాబ్లెట్స్ ని తయారు చేస్తున్నాయి. అయితే ట్యాబ్లెట్స్ లో రంగులు వేరు వేరుగా ఉంటాయి. అలానే కొన్ని ట్యాబ్లెట్స్ ని  మనం గమనిస్తే వాటి మీద అడ్డగీతలు ఉంటాయి.

Video Advertisement

ఎప్పుడైనా ఆ అడ్డ గీతలు చూశారా..?, వాటిని చూసి డిజైన్ అని అనుకుంటున్నారా..? అయితే మీరు పొరపాటు పడినట్టే. అది ఏదో డిజైన్ కోసమో లేదంటే టాబ్లెట్ కి అందంగా ఉండడం కోసమో రూపొందించలేదు. దాని వెనక ఒక కారణం. అది ఏమిటి అనేది ఫార్మసిస్ట్ మన కోసం కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపారు. మరి ఇక మనం వాటి కోసం చూసేద్దాం.

మాత్ర మీద ఉండే ఈ లైన్ ని డీబోస్డ్ లైన్ అని అంటారు. ఈ గీత కనుక టాబ్లెట్ మీద ఉంది అంటే ఆ ట్యాబ్లట్ చాలా పవర్ ఫుల్ అని మనం తెలుసుకోవాలి. అదే విధంగా మాత్ర మీద ఆ గీత ఉంటే అది ముక్క చెయ్యడానికి సులభంగా ఉంటుంది. ఆ లైన్ వలన మాత్ర చక్కగా రెండు ముక్కలు అవుతుంది. అసలు మాత్రని విరవాల్సిన పని ఏమిటి అనే విషయానికి వస్తే..

మన సమస్యని బట్టి డోస్ ని ఇస్తారు వైద్యులు. ఉదాహారానికి 250mg మాత్రమే తీసుకోమంటే అప్పుడు 500mg ట్యాబ్లట్ లో సగం వేసుకోవాలి. ఆ లైన్ ఉంటే మనం సగం చేసి వేసుకోవడం ఈజీ అవుతుంది. కనుక డాక్టర్ ఇలా చెబితే మనం ఈ విధంగా ఫాలో అవ్వాలి. అయితే ఎప్పుడు కూడా డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యకుండా మందులు వాడద్దు. అది ప్రమాదకరం.


End of Article

You may also like