Ads
ప్రపంచంలో ప్రతి చోట ఏదో ఒక ఆచారాన్ని పాటిస్తారు. కొన్ని ఆచారాలు చోటుకు సంబంధించినవి అయ్యి ఉంటాయి. కొన్ని ఆచారాలు కులమతాలకు సంబంధించినవి అయ్యి ఉంటాయి. ప్రతి మనిషి ప్రతి మనిషిని గౌరవిస్తారు. అలాగే వారి ఆచార కట్టుబాట్లను కూడా గౌరవిస్తారు. అయితే ముస్లింలు కూర్చొని నీళ్లు తాగడానికి మనం చూసే ఉంటాం.
Video Advertisement
ఇది ఎంతో మంది పాటిస్తారు. కానీ ఎక్కువగా ముస్లింలు పాటిస్తారు. అలా ముస్లింలు కూర్చొని నీరు తాగడానికి వెనక ఒక కారణం ఉంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలా కూర్చొని నీరు తాగాలి అని ఖురాన్ లో లిఖించబడింది అని చెప్తూ ఉంటారు. ఒకవేళ ఒక మనిషి నించొని నీళ్లు తాగితే శరీరంలోకి నీరు తొందరగా వెళుతుంది.
దీని వల్ల ఊపిరితిత్తులు అలాగే గుండెకి సంబంధించిన ఫంక్షన్స్ తొందరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే అలా నుంచొని నీరు తాగడం వల్ల, నీరు తొందరగా వెళ్లడం వల్ల, శరీరంలోని ఆక్సిజన్ లెవెల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఈ విషయం శాస్త్ర పరంగా కూడా నిరూపించబడింది.
అందుకే చాలా మంది కూర్చొని నీరు తాగుతారు. ఇలా మనం పాటించే ప్రతి పద్ధతి వెనక సైంటిఫిక్ గా నిరూపించబడిన ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. కానీ ఈ విషయాలపై అందరికీ అవగాహన ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మెజారిటీ శాతం వారికి కాకపోయినా ఎవరో కొంత మందికి అయినా ఈ పద్ధతులు పాటించడం వెనక గల కారణాలు తెలిసే ఉంటాయి.
End of Article