నారప్ప హిట్ అవ్వడానికి ప్లస్ పాయింట్స్ ఇవేనా..? అవి లేకపోతే సినిమా ఫలితం వేరేలా ఉండేదేమో..?

నారప్ప హిట్ అవ్వడానికి ప్లస్ పాయింట్స్ ఇవేనా..? అవి లేకపోతే సినిమా ఫలితం వేరేలా ఉండేదేమో..?

by Mohana Priya

Ads

narappa movie story in telugu: పెద్ద హీరోల సినిమాలు డిజిటల్ రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతోంది. కానీ గత కొంత కాలం నుండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పెద్ద హీరోలు కూడా డిజిటల్ రిలీజ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆకాశం నీ హద్దురా, వి, దృశ్యం 2, నారప్ప ఇంకా ఎంతో మంది సీనియర్ హీరోల సినిమాలు, అలాగే స్టార్ హీరోల సినిమాలు, అంతే కాకుండా ప్రేక్షకులు థియేటర్లో రిలీజ్ అవ్వడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలు కూడా డిజిటల్ రిలీజ్ అయ్యాయి.

Video Advertisement

narappa 1

అయితే నారప్ప సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా, ఈ సినిమా హిట్ అవడానికి కేవలం మూడు అంశాలు మాత్రమే కీలకపాత్ర పోషించాయి అని విమర్శకులు అంటున్నారు. మొదటిది వెంకటేష్ నటన. మనం వెంకటేష్ ని ఇంత సీరియస్ రోల్ లో చూసి చాలా కాలమైంది.narappa movie story in telugu  దాంతో నారప్పలో అంత సీరియస్, సెంటిమెంట్ రోల్ లో వెంకటేష్ ని చూసిన ఆడియన్స్ కి మళ్లీ పాత వెంకటేష్ గుర్తొచ్చారు.

narappa review

ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ కూడా ఇదే. ఆ తర్వాత ప్రియమణి నటన. డైరెక్ట్ తెలుగు సినిమాలో ప్రియమణి ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలు చేయలేదు ఏమో. ఇంకొక విషయం ఏంటంటే ప్రియమణి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. దాంతో ప్రియమణి పోషించిన పాత్ర ఇంకా నాచురల్ గా అనిపించింది.

narappa review

ఈ సినిమాకు ఇంకొక మెయిన్ హైలెట్ మణిశర్మ సంగీతం. సినిమాకి ప్రధాన బలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఒరిజినల్ తమిళ్ సినిమాలో వాడిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని తెలుగులో కూడా వాడారు. కానీ మణిశర్మ రీరికార్డింగ్, అలాగే పాటలు కూడా ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

narappa

ఇవి తప్ప ఈ సినిమాకి ఇంకా వేరే హైలైట్ పాయింట్స్ లేవు అని విమర్శకులు అన్నారు. కథ పరంగా కూడా ఇలాంటి కథలు మనం అంతకు ముందు చూసే ఉంటాము అని అంటున్నారు. కానీ ఏదేమైనా కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు.


End of Article

You may also like