కొత్తగా వస్తున్న బైక్స్ కి హెడ్ లైట్స్ ఆఫ్ చేయడానికి బటన్ ఎందుకు లేదు..? దీనివల్ల ఎక్కువ పెట్రోల్ వృధా అవుతుందా..?

కొత్తగా వస్తున్న బైక్స్ కి హెడ్ లైట్స్ ఆఫ్ చేయడానికి బటన్ ఎందుకు లేదు..? దీనివల్ల ఎక్కువ పెట్రోల్ వృధా అవుతుందా..?

by Megha Varna

Ads

మీరు గమనించినట్లయితే 2017 తర్వాత వచ్చిన ద్విచక్ర వాహనాలుకి ఆటోమేటిక్ గా హెడ్ లైట్ లు ఆన్ చేసే ఉంటున్నాయి. వాటికి ఆఫ్ చేసే ఆప్షన్ అనేది లేదు. అయితే ఎందుకు ద్విచక్ర వాహనాలకు ఈ మార్పు చేశారు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఏప్రిల్ 1, 2017 నుండి కూడా మోటార్ సైకిల్స్ కి, స్కూటీలకి ఉండే హెడ్ లైట్స్ ని ఆటోమేటిక్ గా ఆన్ అయ్యి వుండే సిస్టం తో రూపొందించారు.

Video Advertisement

 

ఉదయం పూట కూడా హెడ్లైట్లు ఆన్ అయ్యే ఉంటాయి. అయితే ఈ మార్పుని రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తీసుకు వచ్చింది. AHO ఎక్యుప్మెంట్ తో ఉన్న బండ్లు కి ఈ స్విచ్ ఆటోమేటిక్ గా ఆన్ అయ్యే ఉంటుంది. పగలు, రాత్రి ఎప్పుడూ కూడా ఇవి ఆన్ అయ్యి ఉంటాయి. అయితే ఈ బండ్ల కి కేవలం హై బీమ్ బటన్స్ మరియు లో బీమ్ బటన్స్ మాత్రమే ఉంటాయి.

ఎప్పుడూ కూడా లైట్లు ఎందుకు ఆన్ చేసి ఉంచాలి…?

ఈ విషయం లోకి వస్తే.. ఇప్పటికే ఈ పద్ధతి సురక్షితమని చాలా దేశాలు అనుసరిస్తున్నాయి. అయితే రోజంతా కూడా ఈ లైట్లని ఆన్ చేసి ఉంచడానికి కారణం ఏమిటంటే.. సూర్య కిరణాలు బ్రైట్ గా వున్నా లేదా బ్రైట్ గా లేక పోయినా కూడా ఇతర వాహనాలని చూడడానికి వీలుగా ఈ లైట్లు ఉంటాయి. ఎదురుగ వచ్చే ట్రాఫిక్ ని చూడడానికి బాగుంటుంది. ఏ ఇబ్బంది కూడా రాకుండా హెల్ప్ అవుతుంది. అదే విధంగా చీకటిగా ఉన్నా కాస్త వాతావరణం అటు ఇటుగా ఉన్న ఈ లైట్లు మనకి తోడ్పడతాయి. అందుకనే వీటిని తీసుకు వచ్చారు. అదే విధంగా బజాజ్ ప్లాటినా వంటి మోటార్ సైకిల్స్ కి అయితే డే టైం రన్నింగ్ లైట్స్ ని పెట్టారు. దీనితో కూడా ఎదురుకుండా వచ్చే ట్రాఫిక్ బాగా కనబడుతుంది.

bike head lights

అయితే.. ఇలా బండి నడుపుతున్నంత సేపూ లైట్ ఆన్ లోనే ఉండడం వలన బ్యాటరీ పై కొంత ఒత్తిడి పడ్డప్పటికీ.. ఇబ్బంది ఏమి ఉండదు. ఇందువల్ల పెట్రోల్ ఏమి ఎక్కువ అవ్వదు. ఎందుకంటే లైట్ బ్యాటరీ పవర్ తో వెలుగుతూ ఉంటుంది. ఇంజిన్ ఆన్ లో ఉన్న సమయం లో బ్యాటరీ రీఛార్జి అవుతూనే ఉంటుంది. డైనమో రోటర్ క్రాన్క్ షాఫ్ట్ కి కనెక్ట్ అయ్యి ఉండడం వలన వచ్చే ఎనర్జీ తో బ్యాటరీ రీఛార్జి అవుతుంది. దీనికోసం ఎక్స్ట్రా గా పెట్రోల్ ఖర్చు అయ్యేది ఏమి ఉండదు.


End of Article

You may also like