జీవితంలో మనిషికి ముఖ్యమైనవి రెండే రెండు రోజులు. ఒకటి తను ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజు. ఇంకొకటి తను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు. అంటే జననం ఇంకా మరణం. పుట్టిన తర్వాత బారసాల అన్నప్రాసన, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు మనిషి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి.పుట్టిన తర్వాత జరిగే ఈ కార్యక్రమానికి ఒక కారణం సందర్భం ఉంటుంది. చనిపోయిన తర్వాత చేసే అంతక్రియలు లో పాటించే కొన్ని వీధులకి కూడా కారణం ఉంటుంది. అందులో ఒకటి కుండ పగలగొట్టడం. అది కూడా రెండు రంధ్రాలు పెట్టిన తర్వాత పగలగొడతారు. అలా చేయడం వెనకాల ఉన్న కారణం ఏమిటి అంటే.

Video Advertisement

సాధారణంగా మనిషి ఆయుష్షు 120 సంవత్సరాలు. కాలక్రమేణా వంద సంవత్సరాల కి వచ్చింది. ఇంక ఇప్పుడు జనరేషన్ లో మనుషులు వాడే మందులు కారణంగా 60 70 ఏళ్ల కి వచ్చేసింది. ఇది సాధారణంగా ఒక మనిషి బతికే కాలం. కానీ నిజం చెప్పాలంటే చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలీదు.మనిషి కంటే అతను సంపాదించిన దానికే ఎక్కువ విలువనిచ్చే ఈ కాలంలో, అలా ఆ మనిషి ఆరోగ్యాన్ని కూడా పక్కనపెట్టి కష్టపడుతూ ఉంటుండడంతో ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి వల్ల మరణించే సమయం ఇంకా ముందే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా బలవన్మరణాలు యాక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఏదేమైనా మొదటి ఊపిరి నుండి చివరి శ్వాస దాకా మనిషి పడే జీవితం అనే తపనలో చివరికి జరిగేది ఊపిరి ఆగిపోవడం.

మీరు సినిమాల్లో ఒక మనిషి చనిపోయిన తరువాత తన శరీరం లో నుండి అదే మనిషి రూపం బయటికి వచ్చి పడిపోయిన తన శరీరాన్ని లేపడం, తన బంధువులతో స్నేహితులతో తను చనిపోలేదు బతికే ఉన్నాను అని చెప్పడం చూసే ఉంటారు. దాన్ని ఆత్మ అంటారు. ఆశ్చర్యం ఏమిటంటే నిజజీవితంలో కూడా ఇలానే జరుగుతుంది.మనిషి చనిపోయిన తర్వాత తన అంతక్రియలు అయ్యేవరకు తన ఆత్మ మనిషి లోపలి కి వెళ్లి మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తుంది. శరీరం ఆత్మ రెండు వేరు వేరు. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి అంటే ఆ మనిషి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే బతికే ఉండాలి. చనిపోయిన తర్వాత ఆత్మ చెప్తే శరీరం వినే పరిస్థితిలో ఉండదు. అందుకే ఆత్మ తన వాళ్లతో కలిసి ఉండడానికి శరీరాన్ని లేపి అందులోకి దూరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

చనిపోయిన తర్వాత శరీరం మీద ఒక మూటలో కట్టిన బియ్యపు గింజలను తీసి పరుస్తారు. ఆ గింజల అన్ని ఆత్మ సూర్యోదయం అయ్యే లోపు లెక్కించాలి. అప్పుడే ఆత్మకు తన వాళ్ళని చూసే అవకాశం వస్తుంది. ఒకవేళ సూర్యోదయం లోపు లెక్కించలేకపోతే మళ్ళీ మొదటి నుండి లెక్కించాల్సి వస్తుంది.మనిషి చితి చుట్టూ పట్టుకొని తిరిగే కుండ ఆ మనిషిని సూచిస్తుంది. అందులో ఉన్న నీళ్లు మనిషి ఆత్మ. చనిపోయిన తర్వాత ఎలాగైతే ఆత్మ మనలో నుండి బయటికి వెళ్లి పోతుందో అలాగే నీరు కూడా మెల్ల మెల్లగా బయటికి వెళ్లి పోవడానికి రంధ్రాలను పెడతారు.

కుండ పగలు కొట్టడానికి కారణం ఏంటి అంటే ఇంక ఆత్మకు శరీరం లేదు, ఇప్పుడు కాల్చేస్తున్నాము అని ఆత్మను వెళ్ళిపొమ్మని చెప్పడం.ఇలా హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు మాత్రమే కాదు, మనిషి ఆచారం ప్రకారం చేసే ప్రతి పని వెనుక ఒక అంతరార్థం ఉంటుంది. కానీ అందులో దాదాపు చాలా వాటికి మనకి కారణాలు తెలియదు. అందుకే పుస్తకాలు, ఇంకా మీడియా సహాయంతో ఇలాంటి విషయాలు తెలుసుకోగలుగుతున్నాము.

Source: Facebook News Feed