స్టార్ హీరోలు పబ్లిక్ లో కనపడినప్పుడు వారి ప్రతీ విషయం స్కానింగ్ కు గురి అవుతుంది. వారు ఏ రంగు చొక్కా వేసుకున్నారు..వాళ్లు థరించిన వాచ్ ఖరీదు ఎంత…వాళ్లు వేసుకొచ్చిన కారు కథేంటి ఇలా.. అందుకే వాళ్ళు బయటకి వచ్చిన ప్రతిసారి ఎంతో పర్ఫెక్ట్ గా వస్తారు. బట్ కొన్ని సార్లు మాత్రం వాళ్ల సినిమాల్లో లుక్స్ బయటపడకుండా జాగ్రత్తలు వహిస్తారు కూడా.

Video Advertisement

 

అయితే ప్రస్తుతం అందరూ ప్రభాస్ గురించి, తన ఆహార్యం గురించి చర్చించుకుంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా ప్రభాస్ తన లుక్స్ విషయం, లో ఫాన్స్ ని నిరుత్సాహ పరుస్తూనే ఉన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ తన ఫిజిక్ కోల్పోయి అభిమానులకు షాక్ ఇచ్చాడు.

reason behind prabhas look..

ఒకప్పుడు హండ్సమ్ హంక్ అనిపించుకున్న ప్రభాస్.. ఈ మధ్య తన ఫిజిక్ ని గాలికి వదిలేసినట్లు ఉందని.. డార్లింగ్ ముఖంలో మునుపటి కళ కనిపించడం లేదని నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. అలానే ఎల్లప్పుడూ ప్రభాస్ తన హెయిర్ ని కవర్ చేస్తూ క్యాప్ పెట్టుకోవడంపైనా గట్టిగానే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

reason behind prabhas look..

ఇటీవల లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కి నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు కూడా ప్రభాస్ తన హెయిర్ ని బ్లాక్ క్యాప్ తో కవర్ చేసి కనిపించాడు. దీంతో ప్రభాస్ హెయిర్ కి ఏమైంది? ఎందుకు ఎప్పుడూ కవర్ చేసుకొని కనిపిస్తున్నాడు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రానున్న సినిమాల్లోని లుక్స్ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడా.. లేక హెయిర్ ఊడిపోవడం వల్ల ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నాడా.. అని డార్లింగ్ ఫాన్స్ ఆందోళన పడుతున్నారు.

reason behind prabhas look..

మొత్తం మీద ప్రభాస్ హెయిర్ బాండ్ పెట్టుకోవడం మీద గట్టిగానే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ క్యాప్ లేకుండా కనిపించినప్పుడు మాత్రమే ఈ అనుమానాలన్నీ పటాపంచలవుతాయి.