“చిన్నారి పెళ్లి కూతురు” సీరియల్ తెలుగు నాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. “బాలిక వధు” అనే హిందీ సీరియల్ ను తెలుగు లోకి డబ్ చేసారు. ఈ సీరియల్ లో కొంచం వయసు వచ్చిన ఆనంది గా ప్రత్యుష బెనర్జీ నటించి మెప్పించారు. అవికా గోర్ నటించిన చిన్నప్పటి పాత్రనే.. పెద్దయ్యాక ప్రత్యుష పోషించారు. ఈ సీరియల్ తో ఆమె తెలుగు లోగిళ్ళకు కూడా పరిచయం అయ్యారు.

prathyusha 2

అయితే.. నాలుగేళ్ళ క్రితం ఆమె అకస్మాత్తు గా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. మరో వైపు ఆమె తల్లి తండ్రులు ప్రత్యుష బాయ్ ఫ్రెండ్ అయిన రాహుల్ రాజ్ సింగ్ ప్రత్యుష ను మోసం చేసాడని.. అది భరించలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుంది అని ఆరోపించారు. అప్పటినుంచి వారు న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వారు చాలా దీనస్థితి లో ఉన్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

pratyusha parents

ప్రత్యుష తో పాటే తమ ఐశ్వర్యం కూడా పోయిందని ఆమె తండ్రి బాధపడుతున్నారు. కేవలం సింగల్ రూమ్ లో ఉంటున్నామని.. పూట గడవడమే కష్టం గా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కూతురు ప్రత్యుష ఫామ్ లో ఉన్నపుడు చాలా సంతోషపడ్డాం.. ఇంకా పైకి ఎదగాలని ఆశించాం.. కానీ అంతలోనే ఇలా జరిగిందని ఆమె పేరెంట్స్ బాధపడుతున్నారు.

prathyusha

న్యాయం కోసం పోరాడుతూ ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి నెలకొంది. మా కూతురు మరణించాక.. వచ్చిన తూఫాన్ వలన ఇల్లుని కూడా పోగొట్టుకున్నామని బాధపడుతున్నారు. ప్రత్యుష తల్లి చాలా తక్కువ జీతానికి చైల్డ్ కేర్ సెంటర్ లో పని చేస్తున్నారు. కధలు రాస్తూ ఉండే భర్త కి కూడా వచ్చే ఆదాయం తక్కువే. అలానే రోజులను నెట్టుకొస్తున్నాము అంటూ ఆవేదన చెందారు. 2016 లో రాహుల్ పై కేసు నమోదు కాగా.. మూడు నెలల జైలు శిక్ష తరువాత రాహుల్ బయటకు వచ్చేసారు. రెండేళ్ల క్రితం సలోని శర్మ ను రాహుల్ వివాహం చేసుకున్నారు.