ఫోన్ రీఛార్జ్ చేసినప్పుడు 28 రోజులు వ్యాలిడిటీనే ఎందుకు ఇస్తారు.? నెల రోజులు ఇవ్వకపోవడం వెనక ఇంత బిజినెస్ ఉందా.?

ఫోన్ రీఛార్జ్ చేసినప్పుడు 28 రోజులు వ్యాలిడిటీనే ఎందుకు ఇస్తారు.? నెల రోజులు ఇవ్వకపోవడం వెనక ఇంత బిజినెస్ ఉందా.?

by Mohana Priya

Ads

మనిషికి ఫోన్ అనేది బేసిక్ నీడ్స్ లో ఒకటి అయిపోయింది. ఫోన్ లేకుండా అడుగు బయట పెట్టడం కష్టమే. అంతే కాకుండా చాలా వరకు పనులు కూడా ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది. మనం రీఛార్జ్ చేసుకుంటాం. రీఛార్జ్ చేసుకోవడానికి మనం ఎన్ని రోజులకు వ్యాలిడిటీ కావాలి? అలాగే ఎంత మొత్తానికి రీఛార్జి చేయాలి? అనేది సెలెక్ట్ చేసుకుంటాం.

Video Advertisement

reason behind sim recharge validity for 28 days

అయితే మనం ఒకవేళ నెల రోజులకి రీఛార్జ్ చేయాలి అనుకుంటే అక్కడ రీఛార్జ్ 28 రోజులు మాత్రమే అవుతుంది. దాదాపు ఇప్పుడు మనం వాడే ప్రతి సిమ్ కార్డు లో ఇలాంటి సదుపాయం ఉంటుంది. అయితే సిమ్ కార్డ్ రీఛార్జ్ 28 రోజులు మాత్రమే ఉండడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.

reason behind sim recharge validity for 28 days

ఒకవేళ ఒకసారి మనం రీఛార్జ్ చేసినప్పుడు నెల మొత్తానికి రీఛార్జ్ అయితే ఒక సంవత్సరంలో పన్నెండు సార్లు మాత్రమే మనం మన ఫోన్ రీఛార్జ్ చేసుకుంటాం. అదే ఒకవేళ 28 రోజులకు అయితే ఒక సంవత్సరంలో 13 సార్లు రీఛార్జ్ చేసుకుంటాం. దీనివల్ల సిమ్ కంపెనీలకి లాభం వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సిమ్ కార్డ్ కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీ.

reason behind sim recharge validity for 28 days

మనం ఒకసారి కాలిక్యులేటర్ ఆన్ చేసి అందులో 365 ని 30 తో డివైడ్ చేస్తే 12.1666667 వస్తుంది. అదే 365 ని 28 తో డివైడ్ చేస్తే 13.0357143 వస్తుంది. ఇలా మనం సంవత్సరంలో 12 నెలలు ఉన్నా కూడా 13 సార్లు రీఛార్జ్ చేస్తే ఆ కంపెనీలకి ఈ క్యాలిక్యులేషన్ లో చెప్పినట్టు లాభం వస్తుంది. ఇది కంపెనీ ల యొక్క స్ట్రాటజీ. అందుకే మనం 30 రోజుల్లో కి రీఛార్జ్ చేద్దామని అనుకున్నా కూడా 28 రోజులకు మాత్రమే రీఛార్జ్ అవుతుంది.

reason behind sim recharge validity for 28 days

ముందు ఒక సిమ్ కార్డ్ కంపెనీ ఇలా చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఇదే పద్ధతిని అన్ని సిమ్ కార్డ్ కంపెనీలు పాటించడం మొదలు పెట్టాయి. ఇప్పుడు ప్రజలు కూడా మాములుగా రీఛార్జ్ అంటే 28 రోజుల వరకు మాత్రమే వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు.


End of Article

You may also like