దర్శనం చేసుకున్నాక గుడిలో ఎందుకు ఒకసారి కూర్చోవాలో తెలుసా..? అసలు కారణం ఇదే..!

దర్శనం చేసుకున్నాక గుడిలో ఎందుకు ఒకసారి కూర్చోవాలో తెలుసా..? అసలు కారణం ఇదే..!

by Megha Varna

Ads

ప్రతి దేవాలయంలో కూడా నిత్య పూజ చేస్తూ ఉంటారు. అలాగే పండగలు ముఖ్యమైన రోజులు నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎప్పుడు దేవాలయానికి వెళ్లిన సరే చాలా ఆనందంగా ఉంటుంది. అయితే నిజానికి ప్రతీ దేవాలయంలో కూడా ఏదో మహిమ ఉంటుంది. ఒక్కసారి ఆలయానికి వెళితే చాలు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కొండంత బలం మనకి వస్తుంది. పైగా ప్రశాంతంగా ఉంటుంది.

Video Advertisement

ఏదో కొత్త ఉత్తేజం మనలో చేకూరినట్టు అనిపిస్తుంది. పైగా మన భయాలన్నీ కూడా పోయినట్టు మనం విజయం సాధించగలమన్న నమ్మకం మనలో కలుగుతుంది. భగవంతుడు దగ్గరికి వెళ్లి మన కోరిక చెప్పేస్తే ఇక తీరిపోయినట్లే ఉంటుంది. మరి అక్కడ ఉన్న భగవంతుడు మహిమో లేక దేవాలయం మహిమనో ఆ దేవుడికే తెలియాలి.

దేవాలయంలో మంత్రోచ్చారణాల్లోని శబ్ద తరంగాల వల్ల మనకి చెడు ఆలోచనలు కలగకుండా ఉంటాయి. పైగా మనం ఎలాంటి నిర్ణయాలునైనా తీసుకోడానికి అవుతుంది. అయితే ఎందుకు పెద్దలు దేవాలయంలో దర్శనం అయిపోయాక ఒక సారి కూర్చోవాలని అంటారు అన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది. మీకు కూడా ఆ అనుమానం కలిగిందా..? అయితే మరి దాని కోసం ఇప్పుడు చూద్దాం.

ఎందుకు దేవాలయంలో దర్శనం అయిపోయాక కూర్చోవాలి నేరుగా ఇంటికి వెళ్లిపోవచ్చు కదా..? అయితే నిజానికి ఈ మంత్రోచ్చారణాల్లోని శబ్ద తరంగాల వల్ల మన మనసు బాగుంటుంది. చెడు ఆలోచనలు రావు. చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవుతుంది.

దైవ సన్నిధిలో కాసేపు అలా కూర్చోవడం వల్ల మన జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. అదే ధ్యానం, జపం చేస్తే ఇంకా అద్భుతంగా ఫలితాలను పొందొచ్చు. ఏ సమస్యకైనా చక్కటి మార్గాన్ని మనం వెతుక్కోవచ్చు. అందుకే దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేయకుండా దేవాలయంలో కాసేపు కూర్చోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు.


End of Article

You may also like