Ads
ఏదైనా పెద్ద ప్రదేశంలో పని చేస్తున్నప్పుడు అది కూడా ముఖ్యంగా వ్యవసాయంలో ఎక్కువగా వాడే వాహనాలు ట్రాక్టర్లు. పొలాల్లో ట్రాక్టర్లు ఒక మనిషి పనిని ఎంతో సులభం చేస్తాయి. అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించారా? సాధారణంగా కారు వంటి వాహనాల్లో ఎగ్జాస్టింగ్ పైప్ వెనకాల ఉంటుంది. కానీ ట్రాక్టర్లలో ఎగ్జాస్టింగ్ పైప్ ముందుకు ఉంటుంది. అలా ట్రాక్టర్లలో ఎగ్జాస్టింగ్ పైప్ ముందుకి ఉండటానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.
Video Advertisement
# ట్రాక్టర్లు మనం రోడ్డు మీద మాత్రమే కాకుండా ఇతర ప్రదేశాల్లో కూడా ఉపయోగిస్తాం. ఒకవేళ ట్రాక్టర్ నీరు ఉన్న నేలపై నడుస్తూ ఉంటే, నీళ్లు ఎగ్జాస్టింగ్ పైప్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇంజన్ పాడవడం వంటి సమస్యలు వస్తాయి.
# ఎగ్జాస్టింగ్ పైప్ వాహనానికి వెనకాల ఉండేలా అరేంజ్ చేయడం కన్నా కూడా, ఇంజన్ ఉన్నచోట అరేంజ్ చేయడమే సులభం. పైప్ వర్క్ తక్కువగా ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.
# మన దేశంలో ట్రాక్టర్ ను ఎక్కువగా పొలం పనులకే ఉపయోగిస్తారు. ఎగ్జాస్టింగ్ పైప్ కిందకి ఉంటే అందులో నుండి వచ్చే పొగ పంటలకి హాని కలిగిస్తుంది.
# సాధారణంగా ట్రాక్టర్ ని రెండు భాగాలుగా డివైడ్ చేయొచ్చు. రెండవ భాగం అప్పుడప్పుడు రిపేర్ చేయవలసి వస్తుంది. ఒకవేళ ఎగ్జాస్టింగ్ పైప్ వెనక్కి ఉంటే ఎప్పుడైనా ఏదైనా రిపేర్ వస్తే చేయడం చాలా కష్టం.
# కొన్నిసార్లు ఎగ్జాస్టింగ్ పైప్ చివర కర్వ్ తిరిగి ఉంటుంది. లేదా ఒక ఫ్లాప్ కవర్ ఉంటుంది. దీనివల్ల ఎగ్జాస్టింగ్ పైప్ ఉపయోగించనప్పుడు అందులోకి వర్షం చుక్కలు, లేదా వేరే ఏవైనా ఎగ్జాస్టింగ్ పైప్ లోపలికి వెళ్లకుండా ఉంటాయి.
End of Article