విమానంలో ఇచ్చే ఆహారం రుచి సరిగ్గా ఉండదు… మరి దానికి కారణం ఏమిటో తెలుసా..?

విమానంలో ఇచ్చే ఆహారం రుచి సరిగ్గా ఉండదు… మరి దానికి కారణం ఏమిటో తెలుసా..?

by Megha Varna

Ads

ఎప్పుడైనా మనం విమానంలో ప్రయాణించేటప్పుడు అక్కడ ఏమైనా ఆహారాన్ని తింటే అస్సలు దాని యొక్క రుచి బాగోదు. ఇది నిజంగా నిజం. చాలా మంది విమానంలో ప్రయాణం చేసే వారు ఈ విషయాన్ని అనడం మీరు వినే వుంటారు. లేదా స్వయంగా విమానం లో ప్రయాణం చేసేటప్పుడు మీరు కూడా చూసే ఉంటారు.

Video Advertisement

అయితే ఇలా విమానంలో ఆహారం బాగుండక పోవడానికి కారణం కూడా ఉంది. మరి ఆ కారణం ఏమిటో ఇప్పుడే మనం తెలుసుకుందాం. దీనితో మీకు విమానం లో తినే ఆహారం ఎందుకు రుచిగా ఉండదు అనేది తెలిసి పోతుంది.

నిజానికి దీని వెనుక పెద్ద కారణమే వుంది. డబ్బులు తీసుకుని వాళ్ళు కావాలనే ఆహారం వండడం పై శ్రద్ధ పెట్టరు లేదా వండడానికి సౌకర్యంగా ఉండదు కనుకే రుచి బాగోదు అని మీరు అనుకుంటే పొరపాటే. ఎందుకు ఆహారం బాగుండదు అంటే… విమానంలో ప్రయాణం చేసేటప్పుడు అది ఎంతో ఎత్తుకు వెళుతుంది.

మనం ఎత్తు లో ప్రయాణం చేసేటప్పుడు ఎయిర్ ప్రెషర్ మరియు పొడి గాలి కారణంగా మన నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్ యొక్క సెన్సిటివిటీ బాగా తగ్గిపోతుంది. దీంతో ఏమవుతుంది అంటే 30 శాతం వరకు రుచి తెలియకుండా పోతుంది. ముక్కు లో ఉండే నాసల్ ప్యాసేజ్ లోని మ్యూకస్ పదార్థం కూడా డ్రై గా అయిపోతుంది.

ఈ కారణంగా ఏమవుతుందంటే మనకి వాసన కూడా సరిగా తెలియదు. స్మెల్ మరియు టేస్ట్ రెండూ కూడా మారిపోతూ ఉంటాయి. టేస్ట్ మారిపోవడం వల్లనే రుచి తెలియదు. దీంతో ఏరోప్లేన్ లో ఆహారం తింటే మనకి రుచిగా అనిపించదు. అందుకే విమానంలో ప్రయాణం చేసే వారు ఆహారం బాలేదని అంటూ ఉంటారు.


End of Article

You may also like