అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం వెనకున్న ఈ కథ తెలుసా..? 1911 మార్చ్ 8 న ఏం జరిగింది.?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం వెనకున్న ఈ కథ తెలుసా..? 1911 మార్చ్ 8 న ఏం జరిగింది.?

by Sainath Gopi

Ads

ప్రతి సంవత్సరం మనం మార్చి 8 ను అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం.ఇది మహిళల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను గుర్తు చేసుకునే రోజు. రోజువారీ జీవితంలో మరియు వృత్తిపరమైన వాతావరణంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపడానికి మహిళలకు ప్రత్యేకం గా ఇవ్వబడ్డ ఒక అవకాశం మహిళా దినోత్సవం. లింగ సమానత్వాన్ని వేగవంతం చేయాలన్న అంశాన్ని ప్రతిసంవత్సరం ఈరోజు గుర్తు చేస్తూనే ఉంటుంది.

Video Advertisement

ప్రతి సంవత్సరం ఈరోజున మహిళా దినోత్సవం గా ప్రపంచ దేశాలు జరుపుకుంటున్నాయి. అయితే, మార్చి 8 న మహిళా దినోత్సవం గా ప్రకటించడానికి అసలు కారణం ఏంటో తెలుసా..? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 28, 1909 నాటి కాలం నుంచి మహిళా దినోత్సవం జరపడం ప్రారంభమైంది. న్యూయార్క్‌లో వస్త్ర కార్మికుల సమ్మెను పురస్కరించుకుని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఈ రోజును ఉమెన్స్ డే గా ప్రకటించింది. అయితే, అమెరికా ప్రకటన చేసినప్పటికీ ఎలాంటి వేడుకలు జరగలేదు.

womens day

మొట్ట మొదటి మహిళా దినోత్సవ వేడుకలు 1911 లో జరిగాయి. ఈ వేడుకల సందర్భం గా అనేక యూరోపియన్ దేశాల (ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్) మహిళలు ప్రదర్శనలలో పాల్గొన్నారు. లక్ష మందికి పైగా మహిళలు ఓటు హక్కును, ప్రభుత్వ కార్యాలయాలను నిర్వహించే హక్కును కోరుతూ రోడ్డు పై పోరాటం చేసారు. ఉపాధి లైంగిక వివక్ష తొలగించాలని, సమాన వేతనాన్ని ఇవ్వాలని ఆ మహిళలు డిమాండ్ చేసారు.

womes day

మార్చి 8, 1917 నాటి ఐరోపాలో మరో సంఘటన జరిగింది. సెయింట్ పీటర్స్బర్గ్ (గతంలో పెట్రోగ్రాడ్) లోని మహిళా వస్త్ర కార్మికులు వీధుల్లోకి వచ్చి హక్కుల కోసం పోరాటం చేసారు. ఆ తరువాత ఈ పోరాటం రష్యన్ విప్లవం గా అవతరించింది. ఆ రోజున అంటే మార్చి 8 న, ఐక్యరాజ్య సమితి మహిళలకు ప్రత్యేకమైన రోజు గా గుర్తించింది. ఆరోజు నుంచి మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.జాతీయ, జాతి, భాషా, సాంస్కృతిక, ఆర్థిక, లేదా రాజకీయ విభాగాలతో సంబంధం లేకుండా మహిళలు సాధించిన విజయాలను గుర్తించడానికి ప్రత్యేకం గా మహిళా దినోత్సవం ఏర్పడింది.


End of Article

You may also like