రైల్వే స్టేషన్‌లో కనిపించే బోర్డులు “పసుపు” రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా.? కారణం ఇదే.!

రైల్వే స్టేషన్‌లో కనిపించే బోర్డులు “పసుపు” రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా.? కారణం ఇదే.!

by kavitha

ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారైనా రైలు ప్రయాణం చేసే ఉంటారు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ఎక్కువగా రైలులోనే వెళ్తుంటారు. అయితే రైల్వే స్టేషన్‌లలో కనిపించే కొన్నింటిని ఎక్కువగా పట్టించుకోము. అలాంటి వాటిలో నేమ్‌ బోర్డులు ఒకటి.

Video Advertisement

రైల్వే స్టేషన్‌లలో సాధారణంగా పసుపు రంగులో ఉండే నేమ్‌ బోర్డులు కనిపిస్తుంటాయి. అలా ప్రతి స్టేషన్‌ లో స్టేషన్‌ పేరుతో ఉన్న బోర్డు కనిపిస్తుంటుంది. అయితే నేమ్ బోర్డులు అన్ని పసుపు రంగులో మాత్రమే ఉంటాయి. ఆ  నేమ్‌ బోర్డును చూస్తుంటాం. కానీ నేమ్ బోర్డు ఎందుకు పసుపు రంగులోనే ఉంటుందనే దానిని పట్టించుకోము. అయితే దాని వెనుక ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. పసుపు రంగులో ఉండే నేమ్‌ బోర్డు పైన నలుపు రంగులో అక్షరాలు ఉంటాయి. అయితే రైల్వే స్టేషన్‌లలో నేమ్‌ బోర్డులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం..
ఇతర రంగులతో పోల్చినపుడు పసుపు రంగు ఎక్కువగా ఆకర్షణీయంగా ఉంటుంది. రిఫ్లెక్షన్‌ ఎక్కువగా వచ్చే పసుపు రంగు ఇతరుల దృష్టిని కూడా వెంటనే ఆకర్షిస్తుంది. ఆ కారణం వల్లనే రైల్వేస్టేషన్‌లో ఉండే బోర్డులకి పసుపు రంగును ఉపయోగిస్తారు. పసుపు రంగు నేమ్‌ బోర్డులను దూరం నుండి కూడా ప్రయాణికులు సులభంగా రాబోయే స్టేషన్‌ పేరును గుర్తించగలరు.  పసుపు రంగు బోర్డు పైన నలుపు రంగులో స్టేషన్ పేరుని రాస్తారు. ప్రయాణించే సమయంలో ఇతర రంగులు, వస్తువుల కంటే పసుపు రంగువాటి పైనే దృష్టి వెంటనే పడుతుంది. ఆ కారణంతోనే పసుపు రంగు బోర్డు, నలుపు రంగు అక్షరాలను రైల్వే శాఖ ఉపయోగిస్తుంది.మరో విషయం ఏమిటి  అంటే పసుపు సైన్ బోర్డు పై నలుపు రంగు అక్షరాలు మాత్రమే ఉండటానికి కారణం ఇతర రంగులు పసుపు రంగు పై  హైలైట్ కావు.  అందుకే నలుపు రంగుతో ఊరి పేర్లు రాస్తారు. ఇలా రాయడం వల్ల దూరం నుండి  కూడా ఆ బోర్డు పై ఉన్నదానిని చదవవచ్చు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరగడంతో  తరువాత ఏ స్టేషన్ రాబోతోంది అనేది రైలులో స్టేషన్ రాకముందే తెలుసుకోవచ్చు.  లోకోపైలట్లకు జీపీఎస్ ద్వారా తరువాతి స్టేషన్ ఎంత దూరం ఉందనేది తెలుస్తుంది. అయితే గతంలో దూరం నుండే  కనిపించే  పసుపు బోర్డును చూడగానే లోకోపైలట్ రైలు వేగాన్ని తగ్గించేవారని అంటున్నారు.  Also Read: కరోనా తరువాత 2023 లో ఏమి జరుగుతుంది..? బ్రహ్మం గారు కాలజ్ఞానం లో ఏం చెప్పారు.?


You may also like

Leave a Comment