Ads
రామాయణం భారతీయులకు ఎంత ముఖ్యమైన గ్రంథమో అందరికి తెలిసిందే. అందులోని ప్రతి భాగం నీతినే బోధిస్తుంది. ధర్మం ప్రకారం ఎలా నడుచుకోవాలో వివరిస్తుంది. అందులోని ఘట్టాలన్నీ ధర్మాచరణకు అద్దం పడతాయి. శ్రీ రాముడు మొదలుకొని ప్రతి వ్యక్తి ఎంతో కొంత ప్రభావాన్ని మనపై చూపిస్తారు. వేల సంవత్సరాలుగా రామాయణం మనలో భాగం అయిపొయింది.
Video Advertisement
అసలు రామాయణం అంటే.. రాముడు నడిచిన దారి. అయోధ్య నుంచి లంకానగరం వరకూ సాగిన ప్రయాణమే శ్రీమద్రామాయణ మహాకావ్యం. శ్రీ మహా విష్ణువు యొక్క ఏడో అవతారం రాముని అవతారం. ర్మానికి, న్యాయానికి, నీతికి, మంచికి, మర్యాదకు, విలువలకు, నైతికతకు నిలువుటద్దం శ్రీరాముడు.
అయితే నిత్యం రాముడ్ని పూజించే మన దేశం లో చాలా మంది ఆయన సుగుణాలను మాత్రం అలవరచుకోలేకపోతున్నారు. ఇప్పుడు రాముడికి ఉన్న గొప్ప లక్షణాలు ఏవో చూద్దాం..
#1 గుణ వంతుడు
సకల గుణాలు కలిగిన వాడే రాముడు. రాముడిని సత్యం యొక్క స్వరూపంగా.. ఆదర్శ కుమారునిగా, ఆదర్శ భర్తగా భావిస్తారు.
#2 ధర్మాత్ముడు
ధర్మం తెలిసిన వాడు. ధర్మ బద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు. మనిషి ఇలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి.. మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు.
#3 అన్ని ప్రాణుల మంచి కోరేవాడు
తాను ఒక రాజు కాబట్టి కేవలం తన రాజ్య ప్రజల సంక్షేమమే కోరుకోలేదు రాముడు. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ఒకటే ధర్మం ఉండాలని భావించాడు.
#4 క్రోధాన్ని జయించినవాడు
రాముని జీవితంలో ఎన్నడూ అసభ్యకరమైన మాటలను అస్సలు మాట్లాడలేదట. ఎంత కోపం వచ్చిన దానిని బయటకు ప్రదర్శించడు. అలాగే తనను ఎవరైనా విమర్శిస్తుంటే వాటిని స్వీకరించి తన లోపాలను అధిగమించేవాడు. అవసరమైన చోట్ల మాత్రమే కోపాన్ని చూపించేవాడు రాముడు.
#5 ఎదుటివారిలో మంచిని చూసేవాడు
ఎవరైనా వారి జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు మంచి పనులు కూడా చేస్తుంటారు. అలా చేసిన మంచి పనుల గురించే శ్రీరాముడు ప్రస్తావించేవాడు.
#6 జ్ఞాన సంపన్నుడు
శ్రీ రాముడు వేదాలను, ధర్మాలను పూర్తిగా చదివాడు. ఆధ్యాత్మిక అభ్యాసాలను కూడా పూర్తిగా ఆచరించేవారు.
#7 ద్యుతిమంతుడు
శ్రీ రాముడు తాను వెలుగుతూ ఇతరులకు వెలుగును ఇచ్చేవాడు. దృఢమైన సంకల్పం కలిగినవాడు.
ఈ సుగుణాలే రాముడిని ఆదర్శ పురుషుడిగా నిలబెట్టాయి.
End of Article