Ads
ప్రకృతి యొక్క స్వభావాన్ని మనుషులు కనిపెట్టక ముందే జంతువులు పక్షులు కనిపెట్టేస్తాయి. అయితే సాధారణంగా మన పెద్దలు కూడా అంటూ ఉంటారు కాకి అరుస్తుంటే చుట్టాలు వస్తారని. ఇలాంటివి ఏదో ఒకటి మనం వింటూనే ఉంటాం. అయితే చీమలు, కాకులు పదేపదే వస్తున్నాయంటే దాని వెనక ఉండే అర్థం గురించి ఇప్పుడు మనం చూద్దాం.
Video Advertisement
కాకులు పదేపదే మన ఇంటి దగ్గరికి వచ్చి అరుస్తున్నాయి అంటే దానివల్ల మంచి కలుగుతుందా చెడు కలుగుతుందా..? అలానే చీమలు ఎక్కువగా వస్తున్నాయి అంటే దాని వల్ల ఏమవుతుంది వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఎక్కువగా మన ఇంటికి చీమలు వస్తున్నాయి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలిగిందని తెలియజేసే సంకేతం అది. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు చీమలు ఎక్కువగా మన ఇంటికి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నల్ల చీమలు ఎక్కువగా మన ఇంట్లో తిరుగుతున్నాయి అంటే తప్పకుండా లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతోంది అని మనం తెలుసుకోవాలి.
ఇలా చీమలు కనుక మన ఇంట్లో తిరుగుతున్నాయి అంటే ఈశాన్యం వైపు శివుడు పార్వతి యొక్క చిత్రపటాన్ని ఈశాన్యంలో పెట్టి పూజించడం మంచిది. అదే ఒకవేళ కాకి పదే పదే అరుస్తోంది అంటే పితృదేవతలు అనుగ్రహం కలుగబోతోందని మనం తెలుసుకోవాలి. పురాణాల ప్రకారం రావణుడు నవగ్రహాలని బంధించడానికి వచ్చినప్పుడు రావణుడిని చూసి యమధర్మరాజు భయపడతాడు.
తప్పించుకునే ప్రయత్నంలో అక్కడ ఉండే ఒక కాకిని దారి చూపమని అడుగుతాడు. అప్పుడు కాకి తన శరీరంలోకి ప్రవేశింమని చెబుతుంది. యమధర్మరాజు వెంటనే కాకి శరీరంలోకి ప్రవేశిస్తాయి. రావణాసురుడికి అందకుండా దూరంగా వెళ్ళిపోతాడు. ఈ కారణం చేత యమధర్మరాజు కాకికి ఒక వరమిస్తాడు. ఎవరైతే అమావాస్య రోజు కానీ బంధువులు చనిపోయిన తిధి రోజు కానీ ఆహారాన్ని కాకికి ఇస్తే.. పితృదేవతల ఆత్మ శాంతిస్తుంది అని చెప్పారు.
అందుకే హిందూ సాంప్రదాయం ప్రకారం కాకికి ఆహారం పెడతారు. అలాగే శనివారం మధ్యాహ్నం పూట కాకులకి కుండలో నీళ్లు పోసి ఆహారం కూడా పెడితేవాళ్ళు ఏలినాటి శని ఈ ప్రభావం నుండి బయటపడడానికి అవుతుంది. బయటికి వెళ్ళేటప్పుడు కాకి మనకు ఎదురు పడితే అప్పుడు తప్పకుండా ఆ పని పూర్తవుతుంది. అదే ఒకవేళ కాకి కుండలో నీళ్లు తాగుతూ మధ్యలో మీ వైపు చూసింది అంటే ధనవంతులు కాబోతున్నారని సంకేతం.
End of Article