Ads
జుట్టు రాలిపోవడం, చుండ్రు, జుట్టు తెల్లబడడం, బట్టతల ఇలా చాలా సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఎక్కువ మంది బట్టతలతో ఇబ్బంది పడుతూ వుంటారు. నిజానికి బట్టతల మగవారి అందాన్ని తగ్గించేస్తుంది. దీని కోసం మగవాళ్ళు చాలా రకాల పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు. అయితే మగ వారికి మాత్రమే ఎందుకు బట్టతల వస్తుంది..? ఆడవాళ్ళకు ఎందుకు బట్టతల రాదు..? దీని వెనక ఒక కారణం ఉంది. మరి అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
ఎక్కువగా మగవారికి మాత్రమే బట్టతల వస్తుంది. చాలా అరుదుగా ఆడవాళ్ళలో బట్టతల ఉంటుంది. మగవారికి బట్టతల రావడానికి కారణం మగవారి లో ఉండే టెస్టోస్టెరోన్ హార్మోన్. ఈ హార్మోన్ కారణంగానే మగవారిలో బట్టతల వస్తుంది. టెస్టోస్టెరోన్ మగవారిలో బోన్ స్ట్రెంత్ ని పెంచుతుంది. అలానే మజిల్ మాస్ ని కూడా ఇది పెంచుతుంది. వీర్య కణాల ఉత్పత్తికి కూడా టెస్టోస్టిరాన్ అవసరం.
ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ నుంచి డైహైడ్రో టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మగవారికి జుట్టు పెరగకుండా అడ్డంకిగా మారుతుంది. అలానే ఇది జుట్టును తొలగిస్తుంది కూడా. ఇలా జుట్టు రాలిపోతూ ఉంటుంది మగవారికి. ఈ కారణం వల్లే మగవారిలో బట్టతల వస్తుంది.
మగవారి వయసు పైబడే కొద్దీ బట్టతల సమస్య ఎక్కువ అవుతుంది. అలానే జీన్స్ పరంగా కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆడవారిలో మాత్రం ఈ హార్మోన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లనే ఆడవాళ్లలో బట్టతల ఎక్కువగా ఉండదు. చాలా అరుదుగా మాత్రమే రావడం జరుగుతుంది.
End of Article