Ads
మనం మంది ఈమధ్యకాలంలో బట్టతలతో బాధపడుతున్నారు. ఎప్పుడైనా ఇది ఎందుకు వస్తుంది అని ఆలోచించారా..? అయితే ఈరోజు బట్టతల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఆండ్రోజెనిటిక్ అలోపేసియా అనేది జన్యుపరమైన వ్యాధి.
Video Advertisement
దీని వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. ఆఖరికి బట్టతల వచ్చేస్తుంది. జీన్స్ ని బట్టి కూడా జుట్టురాలిపోవడం అనేది ఉంటుంది.
అయితే అన్ని సార్లు కూడా ఈ జన్యుపరమైన కారణాల వల్ల బట్టతల రాదు. జుట్టు ఊడిపోవడం, బట్టతల రావడం అనేది మస్కులర్ డిస్ట్రోఫీ. ఇది జన్యుపరమైన సమస్య కాదని సైన్స్ అంటోంది. ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అయితే మరి ఏ పోషక పదార్థాలు ఉండాలి అనేది చూద్దాం.
బయోటిన్:
బయోటిన్ జుట్టుకి చాలా అవసరం. బయోటిన్ లోపం వల్ల గోళ్లు విరిగిపోతాయి. కాళ్లు తిమ్మిరి ఎక్కుతాయి. అలానే బలహీనత, మైకం లాంటి సమస్యలు వస్తాయి. బయోటిన్ లోపం ఉంటే జుట్టు కూడా ఊడిపోతుంది.
రాగి:
రాగి లోపం ఉండడం వల్ల కూడా బట్టతల వస్తుంది. భారతదేశంలో కాపర్ సమస్య సహజంగా ఉండదు. ఒకవేళ కనుక ఇది వస్తే కీళ్లలో, మోకాళ్లలో భరించలేనంత నొప్పి ఉంటుంది.
జింక్:
భారత దేశంలో ఎక్కువ మంది జింక్ లోపంతో ఇబ్బంది పడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. జింక్ లోపం కనుక ఉంటే శ్వాసకోశ సమస్యలు, చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అలానే జుట్టు కూడా వేగంగా రాలిపోతుంది. ఒకవేళ కనుక జింక్ లోపం ఉంటే జింక్ సప్లిమెంట్స్ తీసుకోవాలి.
End of Article