ఆ సినిమా రజినీకాంత్ వల్లే డిజాస్టర్ అయిందా.. అసలు విషయాలు బయట పెట్టిన డైరెక్టర్..!?

ఆ సినిమా రజినీకాంత్ వల్లే డిజాస్టర్ అయిందా.. అసలు విషయాలు బయట పెట్టిన డైరెక్టర్..!?

by Anudeep

Ads

మాస్ మసాలా చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారి.. వాటితోనే సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ మరోసారి అదే ఫార్ములాని నమ్మి లింగ మూవీ చేశారు. అడుగడుగుకీ మసాలాని, గ్లామర్ ని గుప్పించే ప్రయత్నం చేసినా సినిమా నేరేషన్ లో మాత్రం అంత స్పీడు లేదు.

Video Advertisement

రజనీకాంత్ కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ముత్తు, నరసింహ సినిమాలు సక్సెస్ అయ్యాయి. అయితే ఈ కాంబినేషన్ లో వచ్చిన లింగ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. డైరెక్టర్ రవికుమార్ వల్లే ఈ సినిమా ఫ్లాపైందని రజనీ అభిమానులు భావించారు. ఈ సినిమాలో కథ, కథనం రజనీకాంత్ రేంజ్ లో లేవని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

కేఎస్ రవికుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో.. లింగ సినిమాకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు. లింగ మూవీ క్లైమాక్స్ లో ఒక బెలూన్ ఫైట్ ఉంటుందని ఆ ఫైట్ ను ముందుగా అనుకోలేదని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో లింగ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో అప్పటి వరకు షూట్ చేసిన సన్నివేశాలను చూడాలని రజనీకాంత్ తనను కోరారని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ సన్నివేశాలను చూసిన తర్వాత రజనీకాంత్ కొన్ని సన్నివేశాలు చెప్పి ఆ సన్నివేశాలను యాడ్ చేయాలని కోరారని రవికుమార్ పేర్కొన్నారు. రజనీ చెప్పిన సీన్లు అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా నచ్చలేదని ఆయన అన్నారు. అంతేకాకుండా రజనీకాంత్ తన పుట్టినరోజున సినిమాను రిలీజ్ చేయాలని కోరడంతో హడావిడిగా సినిమా షూటింగ్ ను పూర్తి చేశామని రజనీకాంత్ వల్లే లింగ మూవీ ఫ్లాపైందని డైరెక్టర్ తెలిపారు.

2014 సంవత్సరంలో డిసెంబర్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి హీరోయిన్లుగా నటించారు. లింగ విడుదలైన 8 సంవత్సరాల తర్వాత కేఎస్ రవికుమార్ రజనీకాంత్ పై ఆరోపణలు చేయడంపై  నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ అనే మూవీలో నటిస్తున్నాడు.


End of Article

You may also like