ఈ 7 కారణాల వల్లే… “పోకిరి” సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యిందా..? అసలు ఏం ఉంది ఈ సినిమాలో..?

ఈ 7 కారణాల వల్లే… “పోకిరి” సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యిందా..? అసలు ఏం ఉంది ఈ సినిమాలో..?

by Anudeep

Ads

ఒక సినిమా ఇండస్ట్రీలో హిట్ గా నిలబడాలి అంటే అప్పటివరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సంపాదించిన సినిమాలను దాటి సరికొత్త రికార్డు సృష్టించాలి అని అర్థం.

Video Advertisement

1999 నుండి 2006 వరకు ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాల పాటు ఇండస్ట్రీని నడిపింది మాస్ ట్రెండ్. ఈ క్రమంలో వచ్చి ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలబడిన సినిమాలే సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు ,ఇంద్ర మరియు పోకిరి.
కానీ ఇంతవరకు ఏ సినిమా ఊహించని అంచనాలను ఛేదించిన పోకిరి ఇండస్ట్రీలో హిట్గా నిలబడడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాము…

1.పూరి మార్క్

సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరోగా చేసింది మహేష్ బాబు ఏనా అని ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగేలా మహేష్ చేత పెర్ఫార్మన్స్ ఇప్పించిన ఘనత పూరికే దక్కుతుంది. ఆ డైలాగ్ డెలివరీ ,కోపంలో ముక్కు ఎగ పీల్చడం,
ఇలాంటి కాన్సెప్ట్స్ తో మహేష్ బాబు ని ఎప్పుడు ఎవరు చూపించనంత మాస్ ఓరియంటెడ్ గా చూపిస్తూ స్టైల్ క్రియేట్ చేశాడు. అన్నయ్య అంటూ మహేష్ బాబు డెలివరీ కొత్తగా క్రేజ్ ని క్రియేట్ చేసింది. హీరో అంటే కేవలం వైట్ కలర్ షర్టు వేయాలి అని నాటుకుపోయిన అభిప్రాయాన్ని పటాపంచలు చేసింది పోకిరి సినిమా.

2.కాంపిటీషన్ లేదు/ రిపీట్ ఆడియెన్స్

పోకిరి రిలీజ్ అయ్యేప్పటికీ ఎటువంటి ఇతర సినిమాలు పోటీకి లేకుండా ఉన్నాయి. ప్రభాస్ పౌర్ణమి ,పవన్ కళ్యాణ్ బంగారం ,బాలయ్య వీరభద్ర ఇలా అప్పటికే రిలీజ్ అయిన పెద్ద చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఆ టైంలో రిలీజ్ అయిన పోకిరి సోలోగా థియేటర్స్ ను కాపాడింది. ఈ సినిమాకి రిపీటెడ్ గా ఆడియన్స్ రావడానికి పక్కన పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడం కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు.

3.సినిమాటోగ్రఫీ

అప్పటివరకు రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లో గ్యాంగ్ వార్స్, మాఫియా అంటేనే అదోరకం బ్లాక్ / గ్రే / బ్రౌన్ ఫార్మాట్లో మూవీ మొత్తం సాగుతుంది.
సగం పైన సినిమా చీకట్లో ఏం జరిగిందో కూడా అర్థం కాక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటిని మారుస్తూ పోకిరి విజువల్స్ తో విన్యాసమే చేసింది. మాఫియా ఫైట్ సీన్లను కూడా కంటికి ఇంపుగా మంచి విజువల్స్ తో దానికి సూట్ అయ్యే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎక్సలెంట్ గా ప్రదర్శించారు.

4.మహేష్ బాబు

పోకిరి మెయిన్ క్యారెక్టర్ పండుగాడు……ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే పండుగాడు….. అంటూ ఫుల్ టైం మాస్ ఎంటర్టైనర్గా కొత్త అవతారం ఎత్తిన మహేష్ బాబు ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాడు. అప్పటివరకు ప్రిన్స్గా లవర్ బాయ్ గా పేరుపొందిన మహేష్ బాబు పోకిరి చిత్రంతో తను ఏ క్యారెక్టర్ నైనా చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు.

5.మణిశర్మ

సినిమాని ఒకసారి చూస్తే ఎంత పెద్ద సన్నివేశాన్ని అయినా రెండోసారి చూసేటప్పుడు అంత శ్రద్ధ వహించం. తెలిసిన ట్విస్ట్ ఏ కదా అన్న ఆలోచన దీనికి కారణం. కానీ ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ప్రతి సీన్ కి హైప్ 100% పెరిగింది. మహేష్ బాబు ఫైటింగ్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మన రక్తంలో కూడా ప్రవహిస్తుందా అన్నట్టు మణిశర్మ ఎలివేట్ చేశాడు. నా కనులని సూటిగా చుస్తే నా ఎదుటికి నేరుగ వస్తే ఈ పోకిరి పొగరుని కవ్విస్తే , ఈ లిరిక్ దగ్గర వచ్చే ట్యూన్ ని పూర్తిగా ఒక ఎమోషనల్ సీన్ లో ది బెస్ట్ ఎలేవేషన్ బిజిఎం గా మార్చిన ఘనత మణిశర్మది.

6.ఇలియానా

అంతకుమునుపే దేవదాస్ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఇలియానా చేసిన రెండవ సినిమా పోకిరి. ఇలియానా కెరియర్ లోనే ఈ సినిమా ఒక రికార్డుగా నిలబడింది.ఈ నాటీ బ్యూటీ నీ పాపులర్ చేసిన సాంగ్ డోలే డోలే.

7.గ్యాంగ్స్టర్/మాఫియా యాక్షన్

అప్పటివరకు సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న ఫ్యాక్షన్ సినిమాలకు భిన్నంగా తిరిగి మాఫియా గ్యాంగ్ వార్స్ రుచి చూపించిన సినిమా పోకిరి. ఆర్జీవి తీసిన సత్యా లాంటి సినిమాలు తప్ప మాఫియా రియల్ గా ఎలా ఉంటుందో మర్చిపోయిన తెలుగు ప్రేక్షకులకు…మాఫియాలో ఉండే కిక్ ని లైవ్ లో చూపించాడు పోకిరి.


End of Article

You may also like