మీతో బ్రేకప్ చెప్పిన వారు ఇలా బిహేవ్ చేస్తున్నారా..? దాని వెనుక ఈ కారణాలు తెలుసుకోండి..!

మీతో బ్రేకప్ చెప్పిన వారు ఇలా బిహేవ్ చేస్తున్నారా..? దాని వెనుక ఈ కారణాలు తెలుసుకోండి..!

by Mounika Singaluri

మనం ఎవరినైనా ఇష్టపడితే ప్రేమిస్తున్నాం అని అనుకుంటూ ఉంటాం. ఒకవేళ నిజం గా ప్రేమించినా.. ప్రేమ అనుకుని పొరబడి ప్రేమించినా.. మనం ప్రేమించిన వారు బ్రేకప్ చెప్తే మాత్రం తట్టుకోలేనంత బాధ వస్తుంది. వారెందుకు ఇలా చేశారా అని ఆలోచిస్తూ ఉండిపోతాం. వారితో మాట్లాడకపోయినా.. బ్రేకప్ తరువాత వారు ఎలా బిహేవ్ చేస్తున్నారో గమనిస్తాం. ఎందుకంటే.. వారు తిరిగి మన వద్దకు వస్తారు అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి.

Video Advertisement

b rekaup

అవును నిజమే. మనం అలా ఎదురు చూస్తాం కాబట్టే బ్రేకప్ చెప్పిన తరువాత వారి లైఫ్ పై మనం మరింత క్యూరియాసిటీ పెంచుకుంటాం. అయితే… వారు మన వద్దకు తిరిగి వస్తారా..? లేదా ? అన్న విషయాన్ని మనం తెలుసుకోలేకపోతాం. వారి ప్రవర్తనను బట్టి వారు తిరిగి వస్తారో లేదో తెలుసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. మీకు బ్రేకప్ చెప్పిన మీ ప్రేయసి/ ప్రియుడు వెంటనే కొత్త రిలేషన్ లోకి ఎంటర్ అయ్యారా? ఇది సహజం గానే జరుగుతుంది.

breakup 3

ఎందుకంటే.. మీకు పూర్తి ఆపోజిట్ లక్షణాలు ఉన్న వారికి వారు సహజం గానే ఆకర్షితులవుతారు. తద్వారా.. బ్రేకప్ వలన కలిగే బాధను పోగొట్టుకోవాలనుకుంటారు. వాళ్ళు తొందరగా మూవ్ ఆన్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారని అర్ధం. మీరు కూడా.. సాధ్యమైనంత తొందరగా మరో వ్యాపకాన్ని కల్పించుకుని ఆ బాధని మర్చిపోవడానికి ప్రయత్నించాలి.

breakup 2

మీరు ప్రేమలో ఉన్నపుడు.. మీరిచ్చిన గిఫ్ట్స్ ని ఇంకా వారి దగ్గరే ఉంటె.. వారు మిమ్మల్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారని అర్ధం. తిరిగి వారు మీ దగ్గరకి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇక వారు మిమ్మల్ని ఇంకా సోషల్ మీడియా లో ఫాలో అవుతూ ఉండి.. మీ ఫోటోలకు లైక్స్ కొడుతూ ఉంటె.. మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

breakup 3

వారు జీవితం లో గతం లో ఎప్పుడు ప్రయత్నించని కొత్త విషయాలని నేర్చుకోవాలని అనుకుంటున్నారు అంటే.. వారు కచ్చితం గా మీ జ్ఞాపకాలను మర్చిపోయి కొత్త గా జీవితం గడపాలని నిర్ణయించుకున్నారని అర్ధం. కొత్త భాష నేర్చుకోవడం, కొత్త ప్రదేశాలను చుట్టి రావడం.. ఇలా ఏదైనా చేస్తున్నారంటే వారు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

breakup 4

మిమ్మల్ని అవాయిడ్ చేయడం తో పాటు.. మీ స్నేహితుల్ని కూడా దూరం పెట్టారంటే.. వాఱెప్పటికీ తిరిగి మీ దగ్గరకి రాకపోవచ్చు. అలా కాకుండా.. మీ స్నేహితులతో టచ్ లో ఉండి, మీతో మాత్రం మాట్లాడకుండా ఉంటే.. మీ దగ్గరకి రాకుండా బెట్టు చేస్తున్నారని అర్ధం. బ్రేకప్ అయిపోయిన తరువాత కూడా మీతో మాట్లాడుతూ.. మీతో టెక్స్ట్ చేస్తూ ఉంటె.. వారు కచ్చితం గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అర్ధం. ఇలా సున్నితమైన విషయాలను గమనించడం ద్వారా.. మీ ప్రేయసి/ప్రియుడు బ్రేకప్ తరువాత ఏ మూడ్ లో ఉన్నారో తెలుసుకోవచ్చు.


You may also like