“రంగ రంగ వైభవంగా” సినిమా నెగిటివ్ టాక్‌కి… కారణం అయిన 5 విషయాలు ఇవేనా..?

“రంగ రంగ వైభవంగా” సినిమా నెగిటివ్ టాక్‌కి… కారణం అయిన 5 విషయాలు ఇవేనా..?

by Anudeep

Ads

‘ఉప్పెన’ వంటి సూపర్ హిట్ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ పై అందరి అంచనాలు పెరిగిపోయాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సక్సెస్ కావడంతో ప్రేక్షకులకు చేరువయ్యాడు వైష్ణవ్. లుక్స్ బావుండటంతో మంచి కథలను ఎంపిక చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని విమర్శకులు అభిప్రాయం పడ్డారు.

Video Advertisement

కానీ ఉప్పెన తర్వాత వైష్ణవ్ ఎంచుకుంటున్న పాత్రలు, సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడుతున్నాయి. ఉప్పెన వంటి కమర్షియల్ హిట్ తర్వాత ‘కొండపొలం’ వంటి నాన్ కమర్షియల్ చిత్రాన్ని వైష్ణవ్ ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో నటుడిగా గుర్తింపు వచ్చినా,  ప్లాప్ అయ్యింది. తాజాగా ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంతో వైష్ణవ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ దీనికి నెగటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమాకి ఈ ఫలితం రావడానికి కారణాలేంటో చూద్దాం..

reasons for ranga ranga vaibhavamga negative talk

1 . ముందుగా ఈ సినిమాకు కథే పెద్ద మైనస్. అసలు వైష్ణవ్ ఇలాంటి కథ ఎలా ఓకే చెప్పాడనేది పెద్ద ప్రశ్న. అనేక సినిమాల కథల ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తాయి. వైష్ణవ్ అనుభవ లేమితో ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడని అభిమానులు చర్చింకుంటున్నారు. కథ సంగతి పక్కన పెడితే టేకింగ్ కూడా బాగోలేదు. ట్రైలర్ విడుదలైన తర్వాత ఆసక్తి కలిగించక పోగా నెగటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.

reasons for ranga ranga vaibhavamga negative talk
2 . కథకు మించిన బడ్జెట్ పెట్టారు కానీ ప్రమోషన్లలో ఆలసత్వం వహించారు. అసలు సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి ఇంత బడ్జెట్ ఎందుకు పెట్టారు అని అనిపిస్తుంది.


4 . కామెడీ సీన్లు కూడా తేలిపోయాయి. సత్య ట్రాక్ వచ్చినపుడు వేరే సినిమాల్లోని ట్రాక్స్ గుర్తొస్తాయి. హీరో పెర్ఫార్మన్స్ బాగుంది కానీ, హీరోయిన్ సెలక్షన్ బాగోలేదు. ఓన్లీ స్కిన్ షోకే పరిమితం చేశారు. ఎక్సప్రెషన్లు పలికించడంలో ఆమె ఇబ్బంది పడటమే కాక సగటు ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయి. ఈ సినిమాలో చాలామంది స్టార్ కాస్టింగ్ ఉంది కానీ వారిని సరిగా ఉపయోగించుకోలేదు. వారికీ సరైన సన్నివేశాలు లేవు.

is vaishnav tej ranga ranga vaibhavamga movie is remake of these 2 movies
7 . దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన రెండు పాటలు బాగున్నాయి కానీ నేపథ్య సంగీతం విషయంలో నీరసం తెప్పించాడు. పాటలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. కాకపోతే చిత్రీకరించిన విధానం ఇంకా కొంచెం బాగుంటే పాటలు ఇంకా ప్లస్ అయ్యే అవకాశం ఉండేదేమో అనిపిస్తుంది.

is vaishnav tej ranga ranga vaibhavamga movie is remake of these 2 movies

8 . లవ్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ అంటేనే డైలాగ్స్ బావుండాలి, ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి. ఆ రెండు లోపించడం కూడా పెద్ద మైనస్.

karthika deepam doctor babu in ranga ranga vaibhavanga movie

సినిమా విడుదలకు ముందే నెగటివ్ బజ్ క్రియేట్ కావడం కూడా ‘రంగ రంగ వైభవంగా’ మూవీకి మైనస్ గా మారింది.


End of Article

You may also like