Ads
కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో ఉండే చాలా మందికి అలాగే, హైదరాబాద్ కి వచ్చిన వారికి ఇక్కడ ఉండే పర్యాటక స్థలాలు, ఇంకా ఫేమస్ ప్లేసెస్ చూడాలి అని ఉండడంతో పాటు ఇంకొక కోరిక కూడా ఉండేది. అదే డబల్ డెక్కర్ బస్ ఎక్కడం. అసలు ఒక వెహికల్ మీద ఇంకొక వెహికల్ ఉండడం ఏంటి? కింద ఉన్న బస్ పైన ఉన్న బస్ బరువుని ఎలా మోయగలుగుతుంది? ఇలా ఎన్నో సందేహాలు వచ్చేవి.
Video Advertisement
చాలా మంది ఎప్పుడో ఒక సారి డబల్ డెక్కర్ బస్ ఎక్కే ఉంటారు. చాలా మంది ఎక్కి కూడా ఉండరు. కానీ కొంత కాలం నుండి ఈ డబల్ డెక్కర్ బస్సులు కనిపించడం లేదు. హైదరాబాద్ లో డబల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రారంభించాల్సిందిగా గత సంవత్సరం ఒక నెటిజన్ కోరగా, దీనికి కేటీఆర్ స్పందించి రవాణా శాఖ మంత్రిని ఈ విషయంపై ఆలోచించవలసిందిగా కోరారు. హైదరాబాద్ లో మళ్లీ డబల్ డెక్కర్ బస్సులు రాబోతున్నాయి అనే వార్త మొదలైంది. అసలు డబల్ డెక్కర్ బస్సులను ఆపివేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
#1 ట్రాఫిక్ సమస్యలు
సిటీలు చాలా అభివృద్ధి చెందాయి. ఎల్లప్పుడు రోడ్లు చాలా బిజీగా ఉంటాయి. డబల్ డెక్కర్ బస్సులు చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా డ్రైవ్ చేస్తారు. దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాగే యావరేజ్ ట్రాఫిక్ స్పీడ్ మీద కూడా ప్రభావం పడుతుంది.
#2 సప్లై పాలసీలో మార్పులు
నగర ఆర్టీసీ కి చెందిన డబల్ డెక్కర్ బస్సులను అశోక్ లేలాండ్ తయారు చేసేవారు. పాలసీలో మార్పుల కారణంగా, 1990 ల మొదట్లో డబుల్ డెక్కర్ బస్సులను ఉత్పత్తి చేయడం ఆపేశారు. అంతే కాకుండా స్పేర్ పార్ట్స్ ఉత్పత్తి కూడా నిలిపివేశారు.
#3 మెయింటెనెన్స్
దాదాపు అన్ని డబుల్ డెక్కర్ బస్సులు 25 సంవత్సరాలకు పైగా నడిచాయి. ప్రతి డబుల్ డెక్కర్‌కు ఇద్దరు టికెట్ కలెక్టర్లు ఉండేవారు. సర్వీసింగ్ కోసం అదనపు స్టాఫ్ అవసరం ఉండే వాళ్ళు. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండేవి.
#4 ఆర్థిక సమస్యలు
2003-2004 లో ఆర్టీసీ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో డబల్ డెక్కర్ బస్సులు కొనడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని.
#5 రోడ్ సెక్యూరిటీ
కొంత కాలం తర్వాత డబల్ డెక్కర్ బస్సులకు చాలా ప్రమాదాలు జరిగాయి. రోడ్డు మలుపులు వచ్చినప్పుడు బస్సుని తిప్పడం కష్టంగా ఉండేది. జనాభా కూడా చాలా పెరిగింది. దాని వల్ల బయటికి వచ్చే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ప్రమాదాలను నివారించడం అనేది కూడా డబల్ డెక్కర్ బస్సులను ఆపడానికి ఒక కారణం.
#6 ఓవర్ హెడ్ వైర్లు
టెక్నాలజీ పెరుగుతుండటంతో టెలిఫోన్ కనెక్షన్లు, అలాగే జనాభా కూడా ఎక్కువవడంతో ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఎక్కువ అయ్యాయి. డబల్ డెక్కర్ బస్సు ఎత్తుగా ఉంటుంది కాబట్టి వెళ్తున్నప్పుడు వైర్లు తగిలే అవకాశాలు ఉంటాయి
ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టారు. అవి చాలా ఆధునికంగా ఉన్నాయి. ముఖ్యంగా ట్యాంక్ బండ్ దగ్గర ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కువగా తిరుగుతున్నాయి.
End of Article