Ads
ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువగా అందరు ఎదుర్కొనేది రిలేషన్ షిప్ సమస్యలు. కొంత మంది ఒకరిని ఇష్టపడతారు. తర్వాత వారు వారికి కరెక్ట్ కాదు అని అర్థమవుతుంది. అయినా సరే విడిపోకుండా అలాగే తమ రిలేషన్ షిప్ ని కొనసాగిస్తారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
# చాలా మంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు. దాంతో ఎవరినైనా ప్రేమిస్తే ఈ ఒంటరితనం తగ్గుతుంది అనుకుంటారు. అంతే కాకుండా సమాజంలో కూడా ఒంటరిగా ఉంటే వ్యక్తులపై ఒక నెగిటివ్ భావన ఉంటుంది. కాబట్టి రిలేషన్ షిప్ లో ఉంటే ఇలాంటివన్నీ తప్పించుకోవచ్చు అనుకుంటారు. అందుకే వారికి నచ్చకపోయినా కొన్ని సార్లు వారి రిలేషన్ షిప్ ని కొనసాగిస్తారు.
# వారిపై వారికి నమ్మకం తక్కువగా ఉండడం కూడా ఇందుకు ఒక కారణమే. ఒక తప్పు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి వీరి తప్పులని ఊరికే ఎత్తి చూపుతున్నప్పుడు ఒక సమయం తర్వాత అదే నిజం అని ,నిజంగానే తమలో చాలా లోపాలు ఉన్నాయి అని అనుకుంటారు. దాంతో వారిని ఎవరూ ప్రేమించరు ఏమో అని భయపడతారు.
#తమ పార్ట్నర్ చేసే తప్పులకు తమని తాము నిందించుకుంటారు. అందుకే వారు ఏమైనా అన్నా కూడా వారి తప్పు వల్లే అవతల వ్యక్తి అలా ప్రవర్తించారు అనే భావనలో ఉంటారు.
# కొంత మంది బహుశా ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ, భవిష్యత్తులో మారుతారు ఏమో అనే భావనలో ఉంటారు. చాలా మంది ఇదే ఉద్దేశంతో వారి ప్రేమని, అలాగే పెళ్లిని కొనసాగిస్తున్నారు. కానీ అలా బహుశా భవిష్యత్తులో మారుతారు ఏమో అనే భావన ఉండి ఒక సూట్ అవ్వని వ్యక్తితో రిలేషన్ షిప్ కొనసాగించడం చాలా తప్పు.
#చాలా మందికి తిరస్కరణలు అంటే భయం ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో వారిని ఎవరైనా రిజెక్ట్ చేస్తారేమో అని భయంతో వారు తప్పు రిలేషన్ షిప్ లో ఉంటారు.
NOTE: All the Images used in this article are just for representative purpose only
End of Article