Ads
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది ఆర్‌ఆర్‌ఆర్. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. వివిధ విభాగాల్లో పురస్కారాలు సైతం అందుకుంది ఆర్‌ఆర్‌ఆర్. ఇటీవలే ప్రపంచ చలన చిత్ర రంగం లో ప్రతిష్టాత్మకంగా భావించే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును సొంతం చేసుకున్నారు రాజమౌళి. అయితే తాజాగా మరో అవార్డు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో చేరింది. ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు గాను ఈ పురస్కారం దక్కింది.
Video Advertisement
తెలుగు చిత్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతోంది ఈ మూవీ. వివిధ దేశాల్లో భారతీయ సినిమాల రికార్డ్స్ ని కొల్లగొడుతోంది ఈ చిత్రం. అయితే ఏ చిత్రానికి రానంత హైప్ ఈ చిత్రానికి వచ్చింది. కరోనా కారణం గా ఎన్నోసార్లు వాయిదా పది ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అలాగే ఈ చిత్రం అందరి అంచనాలు అందుకుంది కూడా.. మరి ఈ చిత్రం ఎందుకింత స్పెషలో ఇప్పుడు చూద్దాం..
#1 ఈ చిత్రం కోసం అందరు అంతగా ఎదురు చూడటానికి మొదటి కారణం రాజమౌళి. ఇద్దరు స్టార్ హీరోలని ఒకే తెరపై రాజమౌళి ఎలా చూపించారు అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. వారిద్దరికీ సినిమాలో సమానమైన పాత్రలు ఉన్నాయి. ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు.
#2 ఇంత గొప్ప కథని తీయాలి రాజమౌళి ఆలోచన గొప్పది. అలాగే బాహుబలి చిత్రం తో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన తర్వాత అంతకు మించిన సినిమా తియ్యాలి అన్న ఆయన ప్లానింగ్ గొప్పది.
#3 ఇద్దరు పోరాట యోధుల పాత్రలకు కల్పిత సంఘటనలు జోడించి మనల్ని కథలోకి నడిపే తీరు అద్భుతంగా ఉంది. వారిద్దరూ కలిసి బ్రిటిష్ కోటపై పోరాటం చేసే తీరు మెప్పిస్తుంది.
#4 ఈ సినిమా అంతా ఒకెత్తు అయితే ‘కొమురం భీముడో..’ పాట మరో ఎత్తు. అసలు ఈ సాంగ్ లో ఎన్టీఆర్ అభినయం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.
#5 ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పెద్ద స్టార్స్ ఈ చిత్రం లో ఉన్నారు కానీ.. మనకి ఈ సినిమాలో ఆ పాత్రలు, వారిద్దరి మధ్య ఎమోషన్స్, వారిద్దరి మధ్య పోరాటాలే కనిపిస్తాయి. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్ ఒక పెద్ద అసెట్.
#6 ఈ చిత్రం తో రాజమౌళి భారత సినిమా ఖ్యాతిని పెంచడంతో పాటు.. దేశం లోని గొప్ప నటుల్ని అందరిని ఈ చిత్రం తో ఒక దగ్గరకి చేర్చారు. అలాగే ఈ చిత్రం లో చిన్న పాత్రలో నటించడానికి కూడా పెద్ద పెద్ద నటులు ముందుకి వచ్చారు అంటేనే తెలుస్తోంది రాజమౌళి గొప్పతనం.
అందుకే ఇన్ని సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా ఇంత గొప్ప సినిమా అయ్యింది. అసలు ఇలాంటి సినిమా మళ్లీ వస్తుందో రాదో కూడా తెలియదు. ఒకవేళ ఇలాంటి సినిమా మళ్లీ వస్తే కూడా ఇంత పెద్ద హిట్ అవ్వడం కష్టం ఏమో. ఇన్ని రికార్డ్ లు సాధించడం కూడా జరగదేమో.
End of Article