అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కల్పిత కథతో రూపుదిద్దుకున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక చివరికి ఈ చిత్రం లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు ని గెలుచుకొని భారతీయ సినిమా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు.
Video Advertisement
అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు, మంచి పాటలు, దిగ్గజాలైన దర్శకులు ఉన్నారు. కానీ ఇప్పటివరకు వారెవరికీ ఇంతటి ఘనత దక్కలేదు. కానీ నాటు నాటు పాటకి అవార్డు ఎలా వచ్చింది అన్నది కొందరి ప్రశ్న. ఇప్పుడు దానికి గల కారణాలేవో చూద్దాం..
#1 సినిమాని చూసే విధానం
ఒకప్పుడు మంచి సినిమా అంటే ఒక బలమైన కథ, కథనం. కొత్త విషయాన్ని అందర్నీ ఆకట్టుకొనేలా చెప్పడం. ఇప్పుడు కేవలం ఎక్కువ మంది ఎలాంటి చిత్రాలు చూస్తున్నారు. భారీగా తెరకెక్కిన చిత్రాలేవీ అన్న కోణం లోనే చిత్రాల విజయాన్ని లెక్కిస్తున్నారు.
#2 స్వాతంత్య్ర సమరపు ఛాయలు
ఆర్ఆర్ఆర్ చిత్రం స్వతంత్ర ఉద్యమ నేపథ్యం లో సినిమా ఉండడం కూడా ఒక ప్రధాన కారణం. ఇలాంటి వాటికీ హాలీవుడ్ వారు ప్రాధాన్యతని ఇస్తున్నారు. గతం లో ఆమిర్ ఖాన్ నటించిన “లగాన్’ సినిమా కూడా ఇలాగే ప్రాచుర్యం పొందింది.
#3 పబ్లిసిటీ
ఆర్ఆర్ఆర్ చిత్రానికి ముందుగానే అంతర్జాతీయ లెవెల్ లో గుర్తింపు లభించింది కానీ, ఆస్కార్ అవార్డ్స్ రావడానికి మాత్రం మూవీ టీం చాలా బలమైన క్యాంపైన్ చేసింది. పది రోజుల ముందు నుండే అమెరికా లోని ప్రతీ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చి ప్రొమోషన్స్ చెయ్యడం మనకి ఆస్కార్ అవార్డు రావడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిల్చింది.
#4 సౌత్ చిత్రాల హవా
ఇంతకు ముందు భారతీయ చిత్రాలు అంటే కేవలం బాలీవుడ్ అనే అనుకొనేవారంతా.. కానీ బాలీవుడ్ కి నేపోటిజం సెగలు తాకడం.. సౌత్ చిత్రాలు మంచి విలువలతో చిత్రాలు తీయడం తో ఈ చిత్రం అందరికి చేరువ అయ్యింది.
#5 సోషల్ మీడియా
మన దేశం లో ఉన్నంత మంది సినిమా పిచ్చోళ్ళు మరే దేశంలో ఉండరు. దీన్ని కాష్ చేసుకోవడానికి ఇండియన్ సినిమా మీద ఎక్కడ లేని ప్రేమని వలకపోసారు విదేశీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్లు. జపాన్, చైనా, ఆఫ్రికా, ఆఖరికి పాకిస్తాన్ లో ఉండే యూట్యూబ్ ఇంఫుఎన్సర్లు కూడా భారత దేశ జనాభాని ఆకర్షించేందుకు సినిమాల మీద ‘రియాక్షన్ వీడియోలు’, ‘రివ్యూలు’ మొదలైనవి మొదలుపెట్టారు. దీంతో మన సినిమాలకు బాగా ప్రచారం లభిస్తోంది.
#6 రాజమౌళి
మన పరిశ్రమలో రాజమౌళి కి ఉన్నంత విజన్ ఇంకెవరికి ఉండదు. తన రెండవ సినిమా ‘సింహాద్రి’ తో అప్పటికి పెద్దగా పేరులేని ఎన్టీఆర్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టాడు. సునీల్ తో హిట్ ఇచ్చాడు. ఆఖరికి ‘ఈగ’ ని పెట్టి వంద కోట్లు రాబట్టాడు. ఇన్ని చేసిన రాజమౌళికి గర్వం ఉండదు. భారతీయ సినిమా స్థాయిని పెంచాలని తపించే రాజమౌళి ఈనాడు అది నిజం చేసి చూపించాడు.
’గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ వచ్చింది కదా, ఆస్కార్ కూడా అవలీలగా వచేస్తుందిలే అని రాజమౌళి రిలాక్స్ అవ్వలేదు. బలమైన క్యాంపైన్ చేసాడు రాజమౌళి.
#7 హాలీవుడ్ లో మార్పులు
ఇంతకు ముందు వరకు ఆస్కార్స్ అంటే అమెరికన్ సిన్మాలకిచ్చే అవార్డులు. అంచలంచెలుగా యురోపియన్ సినిమాలకి కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నల్ల జాతి వారికి కూడా అవకాశం ఇచ్చారు. ఇలా అందరికి అవకాశం ఇస్తూ ఆస్కార్ ప్రతిష్టని పెంచుతున్నారు హాలీవుడ్ జనాలు.
#8 నాటు నాటు ది బెస్ట్
‘నాటు నాటు’ ఒక సాదా సీదా మాస్ పాటే. కానీ ఈ సారి నామినేట్ అయిన ఇతర పాటల కంటే నాటు నాటు చాలా బెటర్.