Ads
కొన్ని నెలల క్రితం జరిగిన ఒక ఘటన చర్చలకు దారి తీసింది. ఒక మహిళ గత సంవత్సరం సెప్టెంబర్ 17 వ తేదీన ఒకే సారి ఒక ఆడ బిడ్డకు, మగ బిడ్డకు జన్మనిచ్చారు. “ఇందులో చర్చలకు దారి తీసే అంత విషయం ఏముంది?” అనుకోకండి. ఒకేసారి పుట్టినా కానీ వారిద్దరూ ట్విన్స్ కాదు. వివరాల్లోకి వెళితే రెబెక్కా రాబర్ట్స్ అనే ఒక మహిళ ఇంగ్లండ్ కి చెందిన వారు. తన భర్త పేరు రైయాస్ వీవర్.
Video Advertisement
రెబెక్కా ఒక బిడ్డతో గర్భవతిగా ఉన్న కొన్ని వారాల తర్వాత మరొక సారి గర్భం దాల్చారు. ఇందుకు కారణం సూపర్ ఫెటేషన్ అని వైద్యులు నిర్ధారించారు. అంటే సాధారణంగా స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత అండాశయం అండం విడుదల చేయడం ఆపేస్తుంది. కానీ సూపర్ ఫెటేషన్ లో మాత్రం ఒకవేళ స్పెర్మ్ కలిస్తే ఇంకొక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది.
నివేదిక ప్రకారం ప్రపంచంలో 0.3 శాతం మహిళల్లో మాత్రమే ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలా జరిగిన సందర్భాల్లో రెండో శిశువు ప్రాణాలను కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కానీ రెబెక్కా రాబర్ట్స్ కి జన్మించిన రెండో శిశువు కూడా ఆరోగ్యంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది అని వైద్యులు పేర్కొన్నారు.
రెబెక్కా, రైయాస్ దంపతులకి పుట్టిన ఆడ పిల్లకు రోసలీ అని పేరు పెట్టగా, మగ పిల్లాడికి నోవా అని పేరు పెట్టారు. ఆడ బిడ్డతో పోలిస్తే మగ బిడ్డ పరిమాణంలో చిన్నగా, బలహీనంగా జన్మించాడు. అందుకు కారణం ఆ బిడ్డ నెలలు నిండకుండా పుట్టడమే అని వైద్యులు తెలిపారు. ఆ బాబుని 95 రోజుల పాటు హాస్పిటల్ లో ఉంచి చికిత్స చేయించారు.
ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడు అని వైద్యులు చెప్పారు. ఆ బాబుకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా కూడా మరో మూడు వారాల పాటు పర్యవేక్షణలో ఉంచాలని చెప్పారు. తనకి ట్విన్స్ జన్మించడంపై రెబెక్కా రాబర్ట్స్ మాట్లాడుతూ ఈ విషయం తనకు ఆశ్చర్యం కలిగించింది అని తెలిపారు.
End of Article