ఈ చెడ్డ పేరు మీకు ఎందుకు “మహేష్” గారూ..? కొంచెం ఆలోచించవచ్చు కదా..?

ఈ చెడ్డ పేరు మీకు ఎందుకు “మహేష్” గారూ..? కొంచెం ఆలోచించవచ్చు కదా..?

by Anudeep

Ads

ఎప్పుడెప్పుడా అని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, గురూజీ త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వచ్చిన ఎస్ఎస్ఎమ్ బీ 28 సినిమా ముహూర్తం ఖరారు చేశారు. ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. మహేష్ సర్కారు వారి పాట వచ్చి నెలలు గడుస్తుంది.

Video Advertisement

అలాగే త్రివిక్రమ్ కూడా అలా వైకుంఠపురంలో తర్వాత డైరెక్షన్ చేయలేదు కానీ భీమ్లా నాయక్ లో స్క్రీన్ ప్లే చూసుకున్నాడు. అయితే క‌థ‌లో మ‌హేష్ చెప్పిన కొన్ని మార్పుల వ‌ల్లే ఈ సినిమా ఇంకా సెట్స్‌మీద‌కు వెళ్ల‌లేద‌న్న గాసిప్‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుండ‌డంతో మ‌హేష్ రెమ్యున‌రేష‌న్ గురించి మ‌రో చ‌ర్చ న‌డుస్తోంది.

మ‌హేష్ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో సినిమాకు రు. 50 – 55 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నట్టు సమాచారం. అయితే త్రివిక్ర‌మ్ సినిమాకు ఏకంగా రు. 70 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. పాన్ ఇండియా మార్కెట్ లేకుండా చూస్తే ఇది చాలా ఎక్కువే అనుకోవాలి. త్రివిక్ర‌మ్‌కు ఎలా లేద‌న్నా 30 కోట్లు ఉంటుంది. వీరిద్ద‌రికే రు. 100 కోట్లు బ‌డ్జెట్ అంటే.. ఇక సినిమాలో మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు, ఇత‌ర మేకింగ్ ఖ‌ర్చు 100 రోజుల షూటింగ్ ఇవ‌న్నీ చూస్తే బ‌డ్జెట్ ఖ‌చ్చితంగా రు. 180 కోట్ల‌కు పైనే అవుతుంది. ఎంత మార్కెట్ చేసినా రు. 200 కోట్ల‌కు మించి మార్కెట్ రావ‌డం లేదు. కేవ‌లం తెలుగు మార్కెట్ వ‌ర‌కు చూస్తే ఇంత రెమ్యున‌రేష‌న్ అంటే మ‌హేష్ సినిమా కొన్న‌వాళ్లెవ్వ‌రికి లాభాలు రావ‌డం లేద‌న్న కంప్లైంట్లు ఉన్నాయి.

మ‌హేష్ త‌న రెమ్యున‌రేష‌న్ ఓ రు. 10 – 15 కోట్లు త‌గ్గించుకుని రు. 50 – 55 కోట్లు తీసుకున్నా వ‌చ్చే న‌ష్టం ఏం ఉంటుంది?  అప్పుడు ఆయ‌న సినిమా కొన్న వాళ్లు.. తీసిన వాళ్లు అంద‌రూ ఫుల్ హ్యాపీగా ఉంటారు. మహేష్ రెమ్యున‌రేష‌న్ కోసం ప‌ట్టుబ‌డితే సర్కారు వారి పాట లాగా సినిమా ప్లాప్‌.. బీ సెంటర్స్ లో యావ‌రేజ్ అన్న మాట‌లే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది నెక్ట్స్ సినిమాల బిజినెస్ పై కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే మ‌హేష్ ఇక‌నైనా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కాస్త ప‌ట్టువిడుపుల‌తో ఉంటే మంచిద‌నే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.


End of Article

You may also like