తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలలో అప్పటి వరకు వచ్చిన ప్రేమకథ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన చిత్రం ప్రేమిస్తే. 2004 లో తమిళ్ లో విడుదలైన కాదల్ మూవీకి ఇది తెలుగు డబ్ మూవీ. ఈ సినిమా కథ ఒక విషాద ప్రేమకథ. బాలాజీ శక్తి వేల్ దర్శకత్వం వహించిన ఈ ట్రెండ్‌ సెట్టర్‌ లవ్‌స్టోరీలో భరత్, సంధ్య ప్రేమికులుగా నటించారు. ఇది వాస్తవంగా మధురై నగరంలో జరిగిన కథ ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా కావడం విశేషం. ఈ చిత్ర దర్శకుడు బాలాజీ శక్తివేల్ ట్రైన్ జర్నీ లో కలిసిన ఒక వ్యక్తి చెప్పిన కథే ఈ ప్రేమిస్తే.

Video Advertisement

ఈ సినిమా డైరెక్టర్ బాలాజీ శక్తివేల్ కి ఇది రెండో సినిమా కావడం విశేషం. మొదటి సినిమాను చియాన్ విక్రమ్ హీరోగా సమురాయ్ తీశాడు. కానీ ఈ చిత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రేమిస్తే సినిమాతో మొదటి హిట్ కొట్టాడు. హీరోయిన్‌గా సంధ్యకు ఇదే మొదటి సినిమా. అయిన తన అభినయంతో అందరినీ కట్టిపడేసిందీ అందాల తార. ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా ఆమె చాలా సినిమాలు చేసినా ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా మాత్రం రాలేదు.

 

remember this heroine from premisthe movie..

తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ‘అన్నవరం’. ఇందులో పవన్ కళ్యాణ్ చెల్లిగా సంధ్య తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. తర్వాత హాసిని అనే చిత్రంలో నటించినా అది హిట్ కాలేదు. అయితే సంధ్య ఎక్కువగా తమిళం, మళయాలం చిత్రాల్లోనే నటించారు. ఆ తర్వాత 2015 లో ఆమె వెంకట్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని -పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె క్రమం గా సినిమాలకు దూరమయ్యారు. అయితే సంధ్య సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా లేదు.

remember this heroine from premisthe movie..

అయితే 2016 సెప్టెంబర్‌లో సంధ్య దంపతులకు ఒక పండంటి ఆడబిడ్డ పుట్టింది. ప్రస్తుతం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోనే నివాసముంటోంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను పూర్తిగా ఎంజాయ్‌ చేస్తోందీ అందాల తార. అయితే తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడం కోసం బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెను చుసిన ఫ్యాన్స్ ఏంటి ఈమె ప్రేమిస్తే సినిమా హీరోయిన్ ఆహ్.. ఇంత మారిపోయిందేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడి చిత్రంలో హీరోయిన్ అక్క పాత్ర పోషించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం.