Ads
అతను సినిమా మనిషి కాదు, అలా అని… పెద్ద పొలిటీషియనూ కాదు, సిక్స్ లు కొట్టే క్రికెటర్ కూడా కాదు , సామాన్య సినిమా ప్రేక్షకుడు. సినిమాలను జీవితానికి లింక్ చేస్తూ చూసుకునే మధ్యతరగతి సినీమా ప్రేక్షకుడు. అతనికి సడెన్ గా ఈ రోజు నటి సౌందర్య గుర్తొచ్చిందంట.. ఎందుకు గుర్తొచ్చింది. ఈ రోజు ఆమె బర్త్ డే కూడా కాదు కదా అని ప్రశ్నిస్తే….
Video Advertisement
బర్త్ డే లకు, వర్థంతులకే గుర్తు రావాలా…? నేను ఎంతగానో ఆరాధించే ఆమెను గుర్తు తెచ్చుకోడానికి నీ పర్మీషన్ నాకవసరమా అంటూ ఎదురు ప్రశ్నించాడు. కరెక్టే .. ఎవ్వరు, ఎప్పుడైనా, ఎలాగైనా, ఎందుకైనా గుర్తు రావొచ్చు. అలా చెబుతూ ,చెబుతూ అతడు తన కండ్లను తూడుచుకుంటున్నాడు. ఎందుకేడుస్తున్నావ్ అంటే… సౌందర్య గుర్తొచ్చిందన్న అని సమాధానం ఇచ్చాడు.. గుర్తోస్తే ఏడవడం ఎందుకు అని అడిగా…. పవిత్రబంధం సినిమాలోని అపురూపమైనదమ్మ ఆడజన్మ పాట గుర్తొచ్చిందని అతని సమాధానం.. అవును ఆ పాట చూస్తే మనకుా ఏడుపొస్తుంది.
మళ్లీ… కాసేపు తర్వాత వెంకటేష్ ఫోటోను చూసుకుంటూ ఏడుస్తున్నాడు ..ఈ సారి ఏమైంది అంటే మళ్లీ సౌందర్య గుర్తొంచింది అని అతని సమాధానం. అరె వెంకీ ఫోటో కు ,సౌందర్య గుర్తు రాడానికి లింక్ ఏంది రా బాబు అనడిగా… ఆ పాటలో హీరో అతనే కదా .. అందుకే ఆమె గుర్తొచ్చిందన్నాడు. ఇది నిజమే వాళ్లిద్దరిదీ సూపర్ హిట్ పెయిర్ కదా…!
అతడు అన్ని చెప్పిన తర్వాత వచ్చి యూట్యూబ్ ఓపెని చేసి పవిత్రబంధం అని టైప్ చేసా… అదే పాట ఫస్ట్ లో ఉంది. విన్నా ఈ సారి నా కంట్లో కన్నీళ్లు వస్తున్నాయ్.. సినిమాలు మన జీవితాల్లో భాగాలు అనడానికి ఇదే కారణం కావొచ్చు బహూషా..!నిన్న సౌందర్య గారి వర్ధనతి సందర్బంగా అతను చెప్పిన మాటలు నాకు మళ్లీ గుర్తొచ్చాయి..
watch video:
End of Article