పాదాలపై చెప్పులు మచ్చలు పడ్డాయా..? అయితే ఇలా తొలగించుకోచ్చు..!

పాదాలపై చెప్పులు మచ్చలు పడ్డాయా..? అయితే ఇలా తొలగించుకోచ్చు..!

by Megha Varna

Ads

మనం ఎలా అయితే ముఖం పై శ్రద్ధ పెడతామొ అదే విధంగా పాదాల పై కూడా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే పాదాలు కి ఏమైనా ఇబ్బందులు వస్తే ఎంతో అసహ్యంగా పాదాలుంటాయి. పైగా పాదాల పై శ్రద్ధ పెట్టకపోతే లేనిపోని చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.

Video Advertisement

ఒక్కొక్కసారి మనం చెప్పులు వేసుకునప్పుడు వాటి గుర్తులు మన కాళ్ళ మీద పడుతూ ఉంటాయి. నిజానికి ఇవి చాలా చికాకుగా ఉంటాయి. మీకు కూడా అలానే కలుగుతూ వుంటుందా..? అయితే తప్పకుండా ఈ విధంగా ఫాలో అవ్వండి.

ఇలా చెప్పులు మచ్చలు కనుక కాళ్ళ మీద పడితే ఈ చిట్కాలను పాటిస్తే ఆ మచ్చలు తొలగిపోతాయి. ఈ ప్రాసెస్ ఏమీ పెద్ద కష్టమైనది కాదు ఈజీగా మనం చెప్పుల వలన పడిన మచ్చలను తొలగించుకోవచ్చు.

  • పాదాలకి కలబంద గుజ్జు రాస్తే మచ్చలు తొలగిపోతాయి. మీరు కలబంద గుజ్జుని పాదాలకి రాసి ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి.. ఆ తరువాత నీళ్లతో కడిగేసుకోండి. దీంతో పాదాలు అందంగా మారుతాయి మచ్చలు కూడా పోతాయి.

  • కమలా తొక్కలను తీసుకుని పౌడర్ కింద చేసి అందులో పెరుగు కాని పాలు కాని వేసి పేస్టు లాగ చేసుకోండి. దీన్ని మీ పాదాలకు అప్లై చేసి 20 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత పాదాలు కడిగేసుకుంటే మచ్చలు పోతాయి. అలానే కాళ్లు కూడా అందంగా ఉంటాయి.
  • ఆలివ్ ఆయిల్ లో కొంచెం పసుపు పొడి వేసి కలిపి దాన్ని పాదాలకు పట్టించి పది నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత నీళ్లతో కడిగేసుకున్నా సరే చెప్పులు మచ్చలు పోతాయి.

  • పాదాలు మెరవాలన్నా మచ్చలు పోవాలన్నా గంధం పొడిలో రోజ్ వాటర్, నిమ్మకాయ రసం వేసి కాళ్ళకు పట్టించి 15 నిమిషాల పాటు అలా వదిలేసి కడిగేసుకుంటే చక్కటి మార్పు వస్తుంది. ఇలా ఈ టిప్స్ ని ఫాలో అయితే చెప్పుల వలన వచ్చిన మచ్చలు పోతాయి. అలాగే పాదాలు కూడా అందంగా మారుతాయి.

End of Article

You may also like